Abn logo
Jul 24 2021 @ 15:30PM

బహ్రెయిన్‌లో మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు

బహ్రెయిన్: టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను బ్రహ్రెయిన్‌లోని టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో ‘ముక్కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన ‘ముక్కోటి వృక్షార్చన’ కార్యక్రమంలో భాగంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బొలిసెట్టి, జనరల్ సెక్రటరీ పుప్పాల బద్రి తదితరులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడారు. ‘మానవత్వానికి, సేవకి మారు పేరైన యువ నేత కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీని  అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రానికి కంపెనీలను తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు’ అని అన్నారు.