Kshama Bindu Sologamy: ఎవరితోనూ లైంగిక సంబంధాలు పెట్టుకోను.. అసలెందుకు స్వీయ వివాహం చేసుకోవాల్సి వచ్చిందంటే..

ABN , First Publish Date - 2022-07-23T17:42:56+05:30 IST

24 ఏళ్ల క్షమా బిందూ.. రాత్రికి రాత్రే దేశ వ్యాప్తంగా సెన్షేషన్ అయింది. పెళ్లి విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తనను తానే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటిం

Kshama Bindu Sologamy: ఎవరితోనూ లైంగిక సంబంధాలు పెట్టుకోను.. అసలెందుకు స్వీయ వివాహం చేసుకోవాల్సి వచ్చిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: 24 ఏళ్ల క్షమా బిందూ.. రాత్రికి రాత్రే దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది. పెళ్లి విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తనను తానే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించగానే భారతీయ సమాజం అంతా ఆమెను వింతగా చూసింది. ఇదేం చోద్యం అంటూ నెట్టింట చర్చోపచర్చలు మొదలయ్యాయి. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎంత మంది బెదిరించినా ఆమె మాత్రం చడీచప్పుడు కాకుండా తనను తానే పెళ్లి చేసుకుని తను అనుకున్నది సాధించింది. హనీమూన్‌కు కూడా వెళ్లబోతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అసలు ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటి..? ఈ నాగరిక సమాజంలో పుట్టి పెరిగిన ప్రతీ యువతి కాబోయే భర్త గురించి, పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంది కదా.. మరి ఈ యువతి ఇలా వింత పోకడలు పోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి..? అసలు ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? తనను తానే పెళ్లాడిన తర్వాత భవిష్యత్‌ గురించి ఆమె చెబుతున్నదేంటి..? అన్నది చూద్దాం..


గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు.. జూన్ 11న తనను తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు (సోలోగమీ) ప్రకటించినప్పటికీ.. కొన్ని సంఘాల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో అనుకున్న ముహూర్తం కంటే రెండు రోజుల ముందే దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలో స్వీయ వివాహం చేసుకుంది. దీంతో దేశంలోనే స్వీయ వివాహం చేసుకున్న యువతిగా ఆమె గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న కారణాలు, పెళ్లి ముహూర్తం సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.



స్వీయ వివాహం చేసుకుంటున్నట్టు ప్రకటించగానే.. నన్ను ఓ నేరస్థురాలిలా ట్రీట్ చేశారు. అయితే అలా చూసిన వారిని నేను ఏ మాత్రం లెక్కచేయలేదు. ఈ నిర్ణయం ఎన్నో ఏళ్ల క్రితమేమీ తీసుకోలేదు.. వివాహానికి కేవలం మూడు నెలల ముందే నేను ఈ ఆలోచన చేశాను. అది కూడా Netflix‌ లో ప్రసారమైన ‘Anne With An E’ అనే షోని చూసి ప్రేరణ ప్రేరణ పొందాను. సోలోగమీ కాన్సెప్ట్ గురించి తెలిసిన వెంటనే నేను ఆలోచనలో పడిపోయా. బహుభార్యత్వం, ఏక భార్యత్వం గురించి నేను విన్నాను. కానీ ఈ సోలోగమీ గురించి మాత్రం ఎప్పుడూ వినలేదు. అందుకని సోలోగమీ (Sologamy) ఇండియాలో చెల్లుబాటు అవుతుందా? లేదా అనే విషయంపై Googleలో సెర్చ్ చేశాను. ఆ తర్వాతే స్వీయ వివాహానికి సిద్ధమయ్యా. ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి షాపింగ్ వెళ్లినా, డ్యూటీకి వెళ్లినా.. బయట ఎక్కడ కనిపించినా ప్రజలు నన్ను వింతగా చూడటం ప్రారంభించారు. 


మీడియా వల్ల చాలా ఇబ్బందిపడ్డా

స్వీయ వివాహం గురించి విని మొదటగా నా తల్లిదండ్రులు, స్నేహితులు కాస్తా గందరగోళానికి గురయ్యారు. కానీ నా మాటల్లో వారికి నమ్మకం కనిపించింది. నేను ఏది చేసినా కరెక్ట్‌గానే చేస్తానని వారికి తెలుసు. అందుకే ఆ తర్వాత వాళ్లే తమ మద్దతు తెలిపి అండగా నిలబడ్డారు. పెళ్లి రోజు దగ్గర పడిన తర్వాత కొందరు స్నేహితులు ఘనంగా బ్యాచిలర్ పార్టీకి కూడా ఏర్పాట్లు చేశారు. మీడియా వల్ల ఆ పార్టీ ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఇంటర్యూల కోసం మీడియా ఎగబడటం, చుట్టుపక్కల వాళ్లు కూడా అభ్యంతరాలు చెప్పడంతో పార్టీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఎటూ కదలకుండా ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. ఒక రకంగా నేను హౌస్ అరెస్ట్ అయ్యాను. కొందరు రాజకీయ నాయకులు నా పెళ్లిపై అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ముందుగా అనుకున్నట్టు గుడిలో పెళ్లి చేసుకోలేపోయాను. చివరికి పురోహితులు కూడా నా పెళ్లి జరిపించేందుకు ముందుకు రాలేదు. 25 మంది పురోహితులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో బ్లూటూత్ స్పీకర్లలో ద్వారా వచ్చిన వేద మంత్రాల మధ్య అతికొద్ది మంది బంధువులు, మిత్రుల సమక్షంలో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. చివరకు ఈ వివాహానికి నా తల్లిదండ్రలు కూడా ప్రత్రక్ష్యంగా హాజరు కాలేకపోయారు. వర్చువల్ విధానంలో నా పెళ్లిని చూడాల్సి వచ్చంది.



8 ఏళ్ల వయసులో భయానక అనుభవాలు

చిన్నతనంలోనే నేను భయానక పరిస్థితులు ఎదుర్కొన్నా. ఎనిమిదేళ్ల వయసులోనే అనేకసార్లు లైగింక వేధింపులకు గురయ్యాను. వేధింపులు ఎదురైన ప్రతిసారీ అద్దం ముందు నిల్చుని ఏడ్చేదాన్ని. ఆ తర్వాత నాకు నేనే ధైర్యం చెప్పుకునేదాన్ని. ప్రతికూల అనుభవాలు ఎదురైన ప్రతిసారి నన్ను నేను బలవంతురాలిగా నమ్మి ముందుకు సాగాను. దీంతో చిన్న వయసులోనే నా ఆలోచనల్లో పరిపక్వత వచ్చింది. మనల్ని మనకంటే ఎవరూ ఎక్కవ ప్రేమించలేరనే విషయం అర్థమైంది. నా జీవితంలో ఎదైనా ది బెస్ట్ డే ఉంది అంటే.. అది నా పెళ్లి రోజే. పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులేమీ రాలేదు. అందరు మహిళల్లా భర్త మెప్పు కోసం జీవించాల్సిన అవసరం నాకు లేదు. భాగస్వామికి ఉద్యోగ రీత్యా స్థానచలనం కలిగినప్పుడు.. అందరిలా నేనూ భర్త పని చేసే ప్రాంతానికి షిఫ్ట్ కావాల్సిన పని ఉండదు. నేను నా గురించి మాత్రమే ఆలోచించుకుంటే సరిపోతుంది. 


వాటిని నేను వ్యతిరేకిస్తా

నేను పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకం. ఈ విషయం నా మనికట్ట దగ్గర ఉన్న పచ్చబొట్టును చూస్తే మీకే అర్థం అవుతుంది. ఎదిగే క్రమంలో పితృస్వామ్యం, జెండర్ రూల్స్ వల్ల నా జీవితం తీవ్రంగా ప్రభావితం అయింది. అందువల్లే వాటిని నేను వ్యతిరేకిస్తా.



పెళ్లి తర్వాత లైగింక జీవితంపై ఎన్నో ప్రశ్నలు..

వివాహ వేడుక ముగిసిన తర్వాత లైంగిక జీవితం గురించి చాలా మంది నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వాటన్నింటికీ తగు రీతిలో సమాధానం చెప్పా. ఇపుడు కూడా అదే చేప్తా. నేను ఎవరితోనూ డేటింగ్ చేయను అని ప్రమాణం చేస్తున్నా. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితోనూ లైగింక సంబంధాలు కూడా పెట్టుకోను. అయినా నా లైంగిక అవసరాలను మాత్రం నేను తీర్చుకోగలను అని నమ్ముతున్నా. అందరు నవవధువుల్లాగే పెళ్లి అనంతరం హనీమూన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇప్పటికే హనీమూన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. ఆగస్ట్ 7న గోవాకు వెళ్లి అక్కడ హనీమూన్ సెలబ్రేట్ చేసుకుంటా. అలాగే.. ఆగస్ట్ 10న పుట్టిన రోజు వేడుకలను కూడా ఘనంగా చేసుకుంటా. ఈ ట్రిప్ సందర్భంగా నా భర్త గురించి అక్కడి ప్రజల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవొచ్చు. అయితే.. దాన్ని అవకాశంగా తీసుకుంటా. భర్త గురించి నన్ను ప్రశ్నించిన వారందరికీ స్వీయ వివాహంపై అవగాహన కల్పిస్తా. ఉద్యోగం చేస్తున్నపుడు చేసుకున్న సేవింగ్స్‌తోనే ఈ ట్రిప్‌కు ప్లాన్ చేసుకున్నాను. హనీమూన్ వెళ్లొచ్చిన అనంతరం మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ పనులు మొదలు పెడతా... అంటూ క్షమ బిందు చెప్పుకొస్తోంది. మరి ఆమె భవిష్యత్ జీవితం ఎలా ఉంటుందో.. ఎన్నెన్ని ఊహించని మలుపులు ఆమె జీవితంలో చోటు చేసుకుంటాయో వేచిచూడాలి.


Updated Date - 2022-07-23T17:42:56+05:30 IST