Jun 7 2021 @ 10:33AM

మెగాఫోన్ పట్టనున్న ముఖ్యమంత్రి కోడలు

త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కోడలు కృతిక ఉద‌య‌నిధి మూడోసారి మెగాఫోన్ ప‌ట్ట‌నున్నారు. ఇది వ‌ర‌కు కృతిక వ‌ణ‌క్క‌మ్ చెన్నై, కాళి చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ఇప్పుడు ఈమె డైరెక్ట్ చేస్తున్న చిత్రంలో కాళిదాస్ జ‌య‌రాం, తాన్య ర‌విచంద్ర‌న్ జంట‌గా న‌టిస్తున్నారు. పెంటెల సాగ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక జ‌ర్నీ ఆఫ్ లైఫ్ మూవీ అని, లాక్‌డౌన్ పూర్తి కాగానే సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తామ‌ని కృతిక తెలిపారు. 

Otherwoodsమరిన్ని...