క్రునాల్‌కు పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-07-28T09:33:55+05:30 IST

కరోనా మహమ్మారి టీమిండియాలో కలకలం రేపింది. శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ క్రునాల్‌ పాండ్యా పాజిటివ్‌గా తేలాడు. దీంతో మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌ను తర్వాతి రోజుకు...

క్రునాల్‌కు పాజిటివ్‌

  • క్వారంటైన్‌కు తరలింపు.. సిరీస్‌కు దూరం 
  • లంకతో రెండో టీ20 నేటికి వాయిదా

కొలంబో: కరోనా మహమ్మారి టీమిండియాలో కలకలం రేపింది. శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ క్రునాల్‌ పాండ్యా పాజిటివ్‌గా తేలాడు. దీంతో మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌ను తర్వాతి రోజుకు వాయిదా వేశారు. క్రునాల్‌ను ఏడు రోజుల క్వారంటైన్‌కు పంపడంతో.. అతడు పొట్టి సిరీ్‌సకు దూరమయ్యాడు. నెగెటివ్‌ వచ్చేంత వరకు అతడు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకూ అనుమతి లేదు. కాగా, పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందికి నిర్వహించిన ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ ఫలితం వచ్చింది. అయినా, వీరు బుధవారం జరిగే రెండో టీ20కి అందుబాటులో ఉండరు. ‘క్రునాల్‌కు దగ్గు, గొంతునొప్పి తదితర లక్షణాలున్నాయి. టీ20 సిరీ్‌సకు అతడు దూరమయ్యాడు. జట్టుతో మళ్లీ కలిసే అవకాశాలు లేవు. అతడితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందిని ఐసోలేట్‌ చేసి.. పరీక్షలు నిర్వహిస్తే అందరికీ నెగెటివ్‌గా వచ్చింద’ని బీసీసీఐ అధికారి తెలిపారు. మరికొన్ని కేసులు బయటపడినా సిరీ్‌సకు ఎటువంటి ఢోకా ఉండదన్నారు. మంగళవారం ఉదయం గొంతు నొప్పిగా ఉన్నట్టు క్రునాల్‌ చెప్పడంతో.. మెడికల్‌ టీమ్‌ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ నిర్వహించారు. అందులో పాజిటివ్‌గా రావడంతో.. మరింత కచ్చితత్వం కోసం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షకూడా చేశారు. అందులో కూడా పాజిటివ్‌గా తేలిందని సమాచారం. లంక టీమ్‌ మొత్తానికి నెగెటివ్‌గా వచ్చింది. రెండో టీ20 ఒకరోజు వాయిదా పడడంతో బుధ, గురువారాల్లో వరుసగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి టీ20లో భారత్‌ గెలిచిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-07-28T09:33:55+05:30 IST