Karnataka: నిండుకుండలా కేఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2021-10-27T16:49:07+05:30 IST

భారీ వర్షాల కారణంగా మైసూరులోని కృష్ణరాజసాగర్‌ జలకళను సంతరించుకొంది. కావేరీ నదిలోకి ప్రతి రోజూ 10 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు కావేరీ జలనిగమ ఉన్నతాధికారులు వెల్లడించారు. 124.80

Karnataka: నిండుకుండలా కేఆర్‌ఎస్‌

                   - జలాశయం భర్తీ కావడానికి ఇక ఒక అడుగే దూరం 


బెంగళూరు: భారీ వర్షాల కారణంగా మైసూరులోని కృష్ణరాజసాగర్‌ జలకళను సంతరించుకొంది. కావేరీ నదిలోకి ప్రతి రోజూ 10 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు కావేరీ జలనిగమ ఉన్నతాధికారులు వెల్లడించారు. 124.80 అడుగుల గరిష్ట సామర్థ్యం కల్గిన కేఆర్‌ఎస్‌ జలాశయంలో ప్రస్తుతం 123.40 అడుగుల స్థాయికి నీరు చేరిందని ఇక కేవలం ఒక అడుగు మాత్రమే మిగిలందన్నారు. కేఆర్‌ఎస్‌ రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో 19,341 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 3,535 క్యూసెక్కులుగా ఉందన్నారు. రిజర్వాయర్‌ గరిష్ట నీటి సామర్థ్యం 49.452 టీఎంసీలు కాగా ప్రస్తుతం రిజర్వాయర్‌లో 47.516 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. గత ఆగస్టు నెలలో డ్యామ్‌ 121 అడుగుల గరిష్ట స్థాయికి చేరిందని మళ్లీ అదే స్థాయి లో రిజర్వాయర్‌ నీటి సామర్థ్యం పెరిగిందని అధికారులు అంటున్నారు. రిజర్వాయర్‌ నుంచి కావేరీ నదికి తద్వారా ఉప నదులకు నీటిని విడుదల చేస్తూ వరదకు తావులేకుండా చూస్తున్నామన్నారు. 2010 అక్టోబరులో తొలిసారిగా కృష్ణరాజసాగర్‌ పూర్తిగా భర్తీ అయింది. అప్పట్లో సీఎంగా ఉన్న యడియూరప్ప వాయనం సమర్పించారు. సాధారణంగా జూలై నుంచి ఆగస్టు నెలల సమయంలో కేఆర్‌ఎస్‌లోకి నీరు అధికంగా వచ్చి చేరుతుందని అధికారులు వెల్లడించారు. జలకళను సంతరించుకున్న కేఆర్‌ఎ్‌సకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఈ నెల 29న వాయనం సమర్పిస్తారని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-10-27T16:49:07+05:30 IST