Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 18 Aug 2022 18:29:20 IST

Krrish 4: ‘క్రిష్-4’ లో కొత్త ప్రపంచం.. ఇతర ప్రత్యేకతలేంటంటే..

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటించిన సూపర్ హీరో చిత్రం ‘క్రిష్’ (Krrish). ఈ సినిమాకీ మూడు భాగాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. ‘క్రిష్-4’ (Krrish 4)ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు గతేడాదే ప్రకటించారు. ‘క్రిష్’ ప్రాంచైజీ మొదలై 15ఏళ్లు పూర్తయింది.ఈ నేపథ్యంలో హృతిక్ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ‘‘గతం ముగిసిపోయింది. భవిష్యత్తు ఏం తీసుకురాబోతుందో చూద్దాం’’ అని అతడు క్యాప్షన్ ఇచ్చాడు. తాజాగా ‘క్రిష్-4’ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బాలీవుడ్ మీడియాలో హల్‌‌చల్ చేస్తుంది.


‘క్రిష్-3’ ఎక్కడైతే ముగిసిందో ‘క్రిష్-4’ అక్కడే ప్రారంభమవుతుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఓ కొత్త ప్రపంచంలో, కొత్త పాత్రలతో, ఆసక్తికరమైన మలుపులతో చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాకేశ్ రోషన్ స్క్రిఫ్ట్‌పై పనిచేస్తున్నట్టు సమాచారం. స్క్రిఫ్ట్ పూర్తి కాగానే నటీ, నటుల ఎంపికపై చిత్ర బృందం దృష్టిపెట్టనుందట. ‘క్రిష్-4’లో యాక్షన్ సన్నివేశాలను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌పై రాజేశ్ రోషన్ (Rajesh Roshan) గతంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘‘చిత్రానికీ సంబంధించిన సంగీత కార్యక్రమాలను ఇంత వరకు మొదలుపెట్టలేదు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే మ్యూజిక్ పనులను మొదలుపెడతాం. మ్యూజిక్, సౌండ్‌లో కొత్త టెక్నాలజీలు అనేకం వచ్చాయి. ఆ టెక్నాలజీని ఉపయోగించి ‘క్రిష్-4’ కు సంగీతాన్ని అందించాలనుకుంటున్నాను. ప్రస్తుతం ప్రతి ఇంటిలో అధునాతమయిన సౌండ్ సిస్టం ఉంది. ఈ సిస్టంలో సౌండ్‌ను ఎంజాయ్ చేయాలంటే కొత్త టెక్నాలజీని తప్పక ఉపయోగించుకోవాలి’’ అని రాజేష్ రోషన్ తెలిపాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘విక్రమ్ వేద’ (Vikram Vedha) లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, రాధికా అప్టే కీలక పాత్రలు పోషిస్తున్నారు. పుష్కర్-గాయత్రి తెరకెక్కిస్తున్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement