‘విద్యుత్‌ మీటర్లు ఇప్పించండి’

ABN , First Publish Date - 2021-03-04T05:33:57+05:30 IST

విద్యుత్‌ మీటర్లు ఇప్పించాలని, విజిలెన్స్‌ వారు పెట్టిన కేసుల సమస్యలు పరిష్కరించాలని పీఆర్‌ గూడెం పంచాయతీ పరిధిలోని కాలనీ కొపల్లెకు చెందిన గిరిజనులు కోరారు.

‘విద్యుత్‌ మీటర్లు ఇప్పించండి’

బుట్టాయగూడెం, మార్చి 3 : విద్యుత్‌ మీటర్లు ఇప్పించాలని, విజిలెన్స్‌ వారు పెట్టిన కేసుల సమస్యలు పరిష్కరించాలని పీఆర్‌ గూడెం పంచాయతీ పరిధిలోని కాలనీ కొపల్లెకు చెందిన గిరిజనులు కోరారు. కేఆర్‌పురం ఐటీడీఏ వద్ద రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి 32 ఏళ్ల కిందట ప్రభుత్వం విద్యుత్‌ సదుపాయం కల్పించగా అప్పటి నుంచి కరెంటును ఉచితంగానే వాడుకుంటున్నామని సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మడకం రామన్న, వేట్ల బాబుల్‌రెడ్డి, కుర్సం రాంబాబు, సోదెం అక్కమ్మ మరికొందరు ఐటీడీఏ పీవో ఆర్‌వీ సూర్యనారాయణకు తెలిపారు. ఇటీవల ఏలూరు నుంచి వచ్చిన విజిలెన్స్‌వారు 81 మందిపై కేసులు పెట్టారని, అప్పుడప్పుడు పోలీసులు ప్రతి ఇంటికి రూ. 500 వసూలు చేస్తు న్నట్టు తెలిపారు. విద్యుత్‌ మీటర్లు కోసం దరఖాస్తు చేశామని అధికారులు స్పందించి మీటర్లు ఇప్పంచాలని, కేసులను పరిష్కారించాలని కోరారు. స్పందించిన పీవో వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-03-04T05:33:57+05:30 IST