Oct 19 2021 @ 19:50PM

SRK టార్గెట్‌గా KRK రచ్చ... పాన్ మసాలా పంచాయితీలోకి అజయ్ దేవగణ్...

బాలీవుడ్ అంటే తెర మీద సినిమాలు మాత్రమే కాదు. తెర వెనుక బోలెడు రాజకీయాలు కూడా. వాటి గురించి బాహాటంగా ట్వీట్లు చేస్తుంటాడు కేఆర్కే. ముంబైలో కమాల్ ఆర్. ఖాన్నే షార్ట్‌గా అందరూ కేఆర్కే అంటుంటారు. అయితే, ఈ సో కాల్డ్ మూవీ క్రిటిక్, రివ్యూయర్, మాజీ నటుడు... ఎప్పుడూ వివాదాస్పద మాటలే మాట్లాడుతుంటాడు. కేఆర్కే కాంట్రవర్సీలు సృష్టించటం అసలు బీ-టౌన్‌లో సర్వ సాధారణ విషయం. ఆ మధ్య, సల్మాన్ ఖాన్ డబ్బులు హవాలా చేస్తున్నాడంటూ ఆరోపణలు చేసి బాలీవుడ్ భాయ్‌జాన్‌ వేసిన పరువు నష్టం కేసు కూడా ప్రస్తుతం ఎదుర్కొంటున్నాడు.


సల్మాన్ తరువాత కేఆర్కే ఇప్పుడు షారుఖ్‌ని కూడా టార్గెట్ చేస్తున్నాడు. ఆయన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అరెస్ట్ కావటంతో కమాల్ ఖాన్ రోజుకొక ట్వీట్ చేస్తున్నాడు. తాజాగా అజయ్ దేవగణ్‌ను వివాదంలోకి లాగుతూ సొషల్ మీడియా పోస్టు పెట్టాడు. ఓ పాన్ మసాలా యాడ్‌లో అజయ్, షారుఖ్ ఇద్దరూ కలసి నటించాల్సి ఉండగా బాలీవుడ్ బాద్షా కుటుంబ వ్యవహారంతో ఇంటికే పరిమితం అవుతున్నాడు. మరి పాన్ మసాలా యాడ్ షూట్ ఎలా? అజయ్ దేవగణ్ తాను ఎస్ఆర్కే కోసం వెయిట్ చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడని... కేఆర్కే అంటున్నాడు. ఆల్రెడీ అజయ్ తన వంతు షూటింగ్ పూర్తి చేసేశాడని కూడా ఆయన చెప్పాడు. 


కేఆర్కే వివాదాస్పద ట్వీట్లు, ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తరువాత, ప్రతీ రోజూ చర్చగా మారుతున్నాయి. బాలీవుడ్‌లో షారుఖ్‌కి మద్దతు తెలుపుతున్న వాళ్లంతా చిన్నపాటి నటీనటులు, దర్శకులేనని ఆయన ఎత్తి చూపుతున్నాడు. అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఇంత వరకూ పబ్లిగ్గా సపోర్ట్ చేయలేదు. కంగనా మాత్రం క్లియర్‌గా తన స్టాండ్ ఏంటో చెప్పింది. కమాల్ ఆర్ ఖాన్ అందుకు ఆమెని మెచ్చుకున్నాడు కూడా! బీ-టౌన్‌లో ‘మేమంతా ఒకే కుటుంబం’ అని చెప్పే డైలాగ్స్ ఫేక్ అని తేల్చేస్తున్నాడు. లోలోన ఎవ్వరి స్వార్థం వారిదేనని ఆయన గత కొన్ని రోజులుగా టాప్ స్టార్స్‌ని టార్గెట్ చేస్తున్నాడు.  

Bollywoodమరిన్ని...