Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 28 Jan 2022 10:39:57 IST

‘పుష్ప విజయం బాలీవుడ్‌కి చెంపపెట్టులాంటిది’

twitter-iconwatsapp-iconfb-icon
పుష్ప విజయం బాలీవుడ్‌కి చెంపపెట్టులాంటిది

బాలీవుడ్‌లో తనకు తానే సినీ విమర్శకుడినని చెప్పుకుంటూ కొత్త సినిమాల రివ్యూలు చెబుతుంటాడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్‌కే). అంతటితో ఆగకుండా బీ టౌన్ స్టార్స్‌పై సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ వివాదాల పాలవుతుంటాడు. అలా సల్మాన్ ఖాన్ నుంచి కంగనా రనౌత్ వరకూ అందరిపై విమర్శలు చేసి కాంట్రవర్సీల్లో ఇరుకున్నాడు.


తాజాగా మొత్తం బాలీవుడ్ స్టార్స్‌ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు కేఆర్‌కే. అందులో.. ‘తెలుగు నుంచి డబ్ అయిన పుష్ప.. హిందీ బెల్ట్‌లో దాదాపు 100 కోట్ల బిజినెస్ చేసింది. అలాంటి గొప్ప విజయాన్ని సాధించినందుకు కంగ్రాట్స్ అల్లు అర్జున్. ఇది బాలీవుడ్ స్టార్స్‌కి చెంపపెట్టులాంటిది’ అని రాసుకొచ్చాడు. 


అలాగే మరో పోస్ట్‌లో.. ‘బాలీవుడ్‌లో పెద్ద స్టార్స్‌గా ఉన్న నటుల సినిమాలు 25 కోట్ల కలెక్షన్లు సాధించడానికే కష్టపడుతుంటే.. ఓ తెలుగు డబ్బింగ్ మూవీ రూ.100 కోట్లు కొల్లగొట్టింది. ఇది చూస్తేనే అర్థమవుతోంది బాలీవుడ్‌ అంటే జనాలకు నచ్చట్లేదు’ అని కేఆర్‌కే చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పుష్ప సినిమా హిందీ సినిమా డిస్ట్రిబ్యూటర్ మనీష్‌కి బంగారు గనిలా మారిందని ఈ క్రిటిక్ తెలిపాడు.



పుష్ప విజయం బాలీవుడ్‌కి చెంపపెట్టులాంటిది

కాగా, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ ఘన విజయాన్ని సాధించింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు కొల్లగొట్టి తెలుగు సినిమాల స్థాయిని మరికొంచెం పెంచింది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...