Abn logo
Apr 10 2020 @ 15:27PM

ప్రియుడితో కలిసి లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్న కృతి!

`తీన్‌మార్`, `బ్రూస్‌లీ` వంటి తెలుగు సినిమాల్లో నటించింది హీరోయిన్ కృతీ కర్బందా. అయితే తెలుగులో ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో ఆమె బాలీవుడ్‌పై దృష్టి సారించి కొన్ని సినిమాల్లో నటించింది. ఈ సమయంలోనే నటుడు పులకిత్ సామ్రాట్‌తో ప్రేమలో పడింది. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. 


ఈ లాక్‌డౌన్ సమయంలో వీరిద్దరూ ఒకే ఇంట్లో గడుపుతున్నారు. తమ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కృతి.. పులకిత్‌తో డేటింగ్ గురించి మాట్లాడింది. `ఈ లాక్‌డౌన్ సమయంలో ఒకే ఇంట్లో ఉండాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. ఇలాంటి సమయంలో అతను నాతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. మేం లాక్‌డౌన్ సమయాన్ని బాగా ఆస్వాదిస్తున్నాం. మిగిలిన జంటలు కూడా ఇలా కలిసి ఉంటూ లాక్‌డౌన్ సమయాన్ని ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నాయో అర్థం కావడం లేద`ని కృతి చెప్పింది. 

Advertisement
Advertisement
Advertisement