May 17 2021 @ 10:07AM

బాలీవుడ్ రీమేక్‌లో కృతి శెట్టి..!

తొలి చిత్రం ‘ఉప్పెన‌’తో కృతిశెట్టి తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆమెకు సినీ అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. తాజా స‌మాచారం మేర‌కు కృతి శెట్టి కిట్టీలో మ‌రో చిత్రం చేర‌నుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ త‌న రెండో త‌న‌యుడు గ‌ణేశ్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇప్ప‌టికే గ‌ణేశ్ హీరోగా ఓ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. కాగా.. గణేశ్ హీరోగా, మ‌రో సినిమాను కూడా బెల్లంకొండ గ‌ణేశ్ ట్రాక్ ఎక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. అందులో భాగంగా 2006లో షాహిద్ క‌పూర్‌, అమృతారావు జంట‌గా న‌టించిన చిత్రం ‘వివాహ్’ రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నార‌ట బెల్లంకొండ సురేశ్‌. ఇందులో గ‌ణేశ్ జోడీగా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టిని న‌టింప చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. అంతా ఓకే అయితే కృతి శెట్టి మ‌రో సినిమాకు ఓకే చెప్పేసిన‌ట్టేన‌ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.