Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 07 Aug 2022 20:07:51 IST

Kriti Sanon: నా బలం అదేనంటున్న కృతి సనన్

twitter-iconwatsapp-iconfb-icon

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ కృతి సనన్(Kriti Sanon). మహేశ్ బాబు నటించిన ‘వన్: నేనొక్కడినే’ తో హీరోయిన్‌గా మారింది. బాలీవుడ్‌ నుంచి వరుసపెట్టి అవకాశాలు రావడంతో అక్కడే సినిమాలు చేస్తుంది. ‘దిల్‌వాలే’ (Dilwale), ‘లుకా చప్పీ’(Luka Chuppi), ‘మిమి’(Mimi) వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. సినీ ఇండస్ట్రీలో పరాజయాలు ఎదురయినప్పుడు ఏ విధంగా ఎదుర్కొంటారని అడగగా స్పందించింది. 


సినిమాలు పరాజయం పాలయినప్పుడు కూడా తట్టుకుని జీవితంలో ముందుకు సాగాలని కృతి సనన్ చెప్పింది. ‘‘నేను కూడా సాధారణ మనిషినే. అందరి లాగే నాకు భావోద్వేగాలు ఉంటాయి. వెండితెర మీద, ఇంటర్వ్యూస్‌లో, బయట నాలోని ధీర వనితను చూస్తారు. నేను భావోద్వేగాలను దాచి ఉంచలేను. మనం పిల్లలుగా ఉన్నప్పుడు సాధారణంగా ఉంటాం. బాధ కలిగితే ఏడుస్తాం. నవ్వాలనిపిస్తే నవ్వుతాం. పక్కవారు ఏమనుకుంటున్నారో అని ఆలోచించాం. కానీ, మనం ఎదిగేకొద్ది పరిపక్వత వస్తుంది. కొన్ని విషయాల వల్ల నేను ఎంత ప్రభావితమయ్యానో చూడనివ్వను. అదే నా బలం. ఆ విధంగానే నేను ఉండాలనుకుంటున్నాను. నేను బాధలో ఉన్నప్పుడు కొన్ని రోజులు ఎవరితో మాట్లాడను. కొన్ని సినిమాలను నేను నమ్మి చేస్తాను. అవి పరాజయం పాలయినప్పుడు తట్టుకోలేను. అయినప్పటికీ బాధను దిగమింగుకుని మరో ప్రాజెక్టులోకి వెళ్లాలి. విజయం సాధించినా, పరాజయం పాలయినా దానిని తప్పకుండా ఒప్పుకోవాలి. మనం అంతకన్న ఏం చేయలేం. ఆ పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. తర్వాతిది విజయం సాధిస్తుందని ఆశించాలి’’ అని కృతి సనన్ చెప్పింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. కృతి సనన్ చివరగా ‘బచ్చన్ పాండే’ (Bachchhan Paandey) లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వరుణ్ ధావన్, కార్తిక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, ప్రభాస్ ల‌కు జోడీగా నటిస్తుంది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement