Abn logo
Nov 28 2020 @ 14:58PM

ఆదిపురుష్: లక్ష్మణుడు, సీత ఎవరు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న చిత్రం `ఆదిపురుష్`. ఆదికావ్యం `రామాయణం` ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అయితే లక్ష్మణుడు, సీత పాత్రల గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. 


సీత పాత్రకు పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించిన ఓం రౌత్ చివరకు కృతి సనోన్‌ను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఈమె గతంలో సూపర్ స్టార్ మహేష్ సరసన `వన్: నేనొక్కడినే`, నాగచైతన్య సరసన `దోచేయ్` సినిమాల్లో నటించింది. కృతినే సీతగా ఫైనల్ చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే లక్ష్మణుడి పాత్రకు బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్‌ని తీసుకోబోతున్నారట. ఈ సినిమాను 3డి, 2డిలో టీ సిరీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement