‘ఉప్పెన’ (Uppena) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు తొలిసారి పరిచయమైన కన్నడ భామ కృతిశెట్టి (Krithishetty). తొలి చిత్రంతోనే కథానాయికగా సంచలనం సృష్టించింది ఈ బ్యూటీ. ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం అమ్మడి ఆభరణాలు. ఈ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ తో కృతిశెట్టి వరుసగా అవకాశాలు కైవసం చేసుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమె నటించిన ‘బంగార్రాజు (Bangarraju), శ్యామ్ సింగరాయ్’ (Shyam Singharoy) చిత్రాలు సైతం సూపర్ హిట్ అవడంతో హ్యాట్రిక్ హిట్ సాధించిన కొత్త కథానాయికగా ప్రత్యేకంగా నిలిచింది.
ప్రస్తుతం కృతి తెలుగులో ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (Ee Ammayigurinchi Meeku Cheppali), మాచర్ల నియోజకవర్గం’ (Macharla Niyojakavargam) లాంటి సినిమాలతో పాటు రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా, లింగుసామి (Lingusamy) దర్శకత్వంలో రూపొందుతున్న పోలీస్ యాక్షన్ చిత్రం ‘ది వారియర్’ (The Warrior)లోనూ నటిస్తోంది. తెలుగు తమిళ బైలింగ్విల్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. కృతి శెట్టికి కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పుడు బాల (Bala) దర్శకత్వంతో సూర్య (Surya) హీరోగా నటించే ఆయన 41వ చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది.
ఆ తర్వాత యోగిబాబు (Yogibabu) హీరోగా ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందిన ‘మండేలా’ (Mandela) ఫేం అశ్విన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ (Shivakarthikeyan) హీరోగా నటించే చిత్రంలోనూ కృతిశెట్టి అవకాశం దక్కించుకుంది. అయితే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే శివకార్తికేయన్ కమిట్ అయిన రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాతే సెట్స్‌పైకి వెళ్ళనుంది. కామెడీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కృతిశెట్టి వైవిధ్యమైన పాత్ర పోషించబోతున్నట్టు టాక్. కేవలం గ్లామర్ కే ప్రధాన్యతనివ్వకుండా.. అభినయం పరంగానే ఆమె పాత్ర ప్రత్యేకం కాబోతోంది. మరి శివకార్తికేయన్ జోడీగా కృతిశెట్టి ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.