Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 19 Aug 2022 13:11:23 IST

Krithi Shetty : అర్జెంట్‌గా ఓ హిట్టు పడాలి !

twitter-iconwatsapp-iconfb-icon

‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది తుళు సుందరి కృతి శెట్టి (Krithi Shetty). తొలి ప్రయత్నంలోనే కుర్రకారు మనసులు దోచేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్‌తో పెద్ద సంస్థలనుంచి వరుస అవకాశాలు కైవసం చేసుకుంది. ఆ తర్వాత నానీ (Nani) ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singharoy), నాగార్జున, నాగచైతన్యల ‘బంగార్రాజు’ (Bangarraju) చిత్రాలు రెండూ సూపర్ హిట్స్ సాధించడంతో ఆమె కెరీర్ లో తొలి హ్యాట్రిక్ నమోదయింది. అయితే నెలతిరక్కుండానే రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ ఆమెకు గట్టి షాకిచ్చాయి. 

రామ్ (Ram) అండ్ నితిన్ (Nithin) కెరీర్స్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ది వారియర్ (The Warrior), మాచర్ల నియోజకవర్గం (Macharla Niyojakavargam)’ చిత్రాలు రెండూ ఘోరమైన ఫలితాలు చవిచూశాయి. ఈ రెండు సినిమాల్లోనూ కృతిశెట్టికి అంతగా ప్రాధాన్యతలేని పాత్రలే దక్కాయి. అది కూడా ఆమెకు మైనస్ అయింది. ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ చిత్రాల సక్సెస్‌తో వచ్చిన ఆనందం ఎన్నోరోజులు ఆమెకు మిగల్లేదు. ప్రస్తుతం కృతిశెట్టి ఆశలన్నీ సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Indraganti Mohankrishna) తెరకెక్కి్స్తున్న ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Ee ammayigurinchi Meeku Cheppali) చిత్రంపైనే ఉన్నాయి. వచ్చేనెల 16న విడుదల కానున్న ఈ సినిమాను ‘సమ్మోహనం’ (Sammohanam) తరహాలో క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. 

సుధీర్ బాబు హిట్టు ముఖం చూసి చాలా కాలమైంది. కరోనా టైమ్ లో ఓటీటీలో విడుదలైన ‘వి’ (V), ఆ తర్వాత థియేటర్స్ లో విడుదలైన ‘శ్రీదేవి సోడాసెంటర్’ (Sridevi Soda centre) చిత్రాలు రెండూ డిజాస్టర్స్ అయ్యాయి. ఇలాంటి సమయంలో ‘వి’ లాంటి ఫ్లాప్ సినిమా తీసిన ఇంద్రగంటి దర్శకత్వంలోనే ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో నటిస్తున్నాడు. మొత్తానికి కృతిశెట్టితో పాటు సుధీర్ బాబుకు, ఇంద్రగంటికి ఈ సినిమా హిట్టవ్వడం చాలా అవసరం. మరి ఈ చిత్రం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement