అప్పన్న ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు రేపు

ABN , First Publish Date - 2022-08-19T06:37:13+05:30 IST

అష్టమి తిధి రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో ఈనెల 20న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలునిర్వహిస్తున్నట్టు ఈఓ డి.భ్రమరాంబ తెలిపారు.

అప్పన్న ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు రేపు

ఆరోజు సాయంత్రం  6 గంటల వరకే దర్శనం

సింహాచలం, ఆగస్టు 18: అష్టమి తిధి రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో ఈనెల 20న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలునిర్వహిస్తున్నట్టు ఈఓ డి.భ్రమరాంబ తెలిపారు. ఈ కారణంగా శనివారం మధ్యాహ్నం 11.30 గంటలకు జరగాల్సిన రాజభోగం మహానివేదన రాత్రి ఉత్సవం అనంతరం జరుగుతాయన్నారు.


అందువల్ల ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిర్విరామంగా భక్తులకు స్వామి దర్శనం లభిస్తుందని, పవళింపు సేవ అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే దర్శనలు లభిస్తాయని తెలిపారు. ఉత్సవం కోసం ఆలయ బేడా మండపంలో ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారు. 21న సాయంత్రం 5 గంటలకు ప్రధాన రాజగోపురం ఎదురుగా మాడవీధుల్లో ఉట్ల సంబరం నిర్వహిస్తారు. 

Updated Date - 2022-08-19T06:37:13+05:30 IST