చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు..

ABN , First Publish Date - 2022-08-20T05:00:16+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు..
గద్వాల పట్టణంలో కృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు

- జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు

- ఉత్సాహంగా ఉట్టి కొట్టిన యువకులు

- రాధాకృష్ణులు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు

గద్వాల టౌన్‌, ఆగస్టు 19 : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. గద్వాల పట్టణంలోని విశ్వేశ్వరయ్య పాఠశాల లో విద్యాకమిటీ చైర్మన్‌ పి.రాధాకృష్ణ పూజలు చేసి, వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు  శ్రీకృష్ణుడు, గోవర్ధనగిరిధారిగా, యశోద, కృష్ణుడు, కుచే లుడు, గోపికా సమేత కృష్ణుడి వేషధారణలో ఆకట్టు కున్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృ తిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  కార్యక్రమంలో గంజ్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ప్రెసి డెంట్‌ చంద్రశేఖరయ్య, విద్యాకమిటీ  వైస్‌ చైర్మన్‌ తిమ్మా రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్‌మోహన్‌,  కోశాధికారి జయప్రకాష్‌, డెరెక్టర్‌లు కృష్ణయ్య,  సుదర్శన్‌, తారానాథ్‌, నరసింహులు, పాఠశాల ప్రిన్సిపాల్‌ భారతి ఫడ్నవిస్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాఘవేంద్ర పాల్గొన్నారు.  


మానవపాడు : మండలంలోని మానవ పాడు, అమరవాయి, నారాయణపురం, జల్లాపురం, పల్లె పాడు గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. కృష్ణస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిం చారు. చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణల్లో ఆకట్టుకున్నారు. 


ధరూరు : ధరూరులో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ కాన్సెప్ట్‌ విద్యార్థులు వైఎస్‌ఆర్‌ చౌరస్తా వద్ద చేసిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 


అయిజ : మండలంలోని ఎక్లాస్‌పూర్‌లో త్రైత  సిద్ధాత ప్రబోద సేవా సమితి అధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.  కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు తట్టే మహేష్‌, నాయకులు ఎక్లాస్‌పూర్‌ నర్సింహరెడ్డి, బింగిదొడ్డి వెంకట్రాములు, లక్ష్మన్న పాల్గొన్నారు.


కేటీదొడ్డి : మండల కేంద్రంలో త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి కేటీదొడ్డి శాఖ ఆధ్వర్యంలో  కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. కృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉత్సాహం గా కోలాటం ఆడుతూ పాటలు పాడారు. నిర్వాహకులు కృష్ణమూర్తి, రేణప్ప, రాములు మాట్లాడుతూ శనివారం ఉదయం ఆరు గంటలకు కృష్ణుడి ఊరేగింపు నిర్వహిం చనున్నట్లు తెలిపారు. మండలంలోని నందిన్నె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రాఘవేంద్ర పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, గోపి కల వేషధారణలో నృత్యాలు చేసి అలరించారు. కార్య క్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాఘవేంద్ర, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.  


ఉండవల్లి : మండల కేంద్రంలోని బస్టాండ్‌ సర్కిల్‌ లో నంద గోపాల యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణా ష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి చిత్ర పటానికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు గోపాలుడు, గోపికల వేషధారణలో నృత్యాలు చేశారు. సాయంత్రం కృష్ణుడి చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షు డు కాలువ శ్రీనివాసులు. మారమునగాల సర్పంచు శివనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు కురుమూర్తి, కమతం నరసింహ, సభ్యులు శ్రీరాములు, గోవిందు, వెంకటేశ్వర్లు, గోద మహేష్‌, గోద రాజశేఖర్‌, రాజు, పరశురాముడు, మహేష్‌, వెంకటరాయుడు, రాజశేఖర్‌ పాల్గొన్నారు.


రాజోలి : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు గజేంద్రరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడి వేషదారణలో ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్‌ శాంతయ్య, ఉపాధ్యాయులు సురేష్‌, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 


ఇటిక్యాల : మండలంలోని ఎర్రవల్లిచౌరస్తాలో కృష్ణాష్టమి వేడుకలను త్రైతసిద్ధాంత సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో శ్రీకృష్ణుడి ప్రతిమకు పూజలు చేశారు. అనంతరం గ్రామంలో శ్రీకృష్ణుడిని పల్లకిలో ఊరేగించారు. కార్యక్రమంలో ఎర్రవల్లి సర్పంచు రవి, ఎస్‌ఐ గోకారి, ప్రబోధసేవా సమితి  సభ్యులు బీచుపల్లి, వెంకటేష్‌, మనెమ్మ, రామాచారి పాల్గొన్నారు.





Updated Date - 2022-08-20T05:00:16+05:30 IST