కాంగ్రెస్‌ హయంలోనే కృష్ణపట్టె అభివృద్ధి

ABN , First Publish Date - 2022-05-23T06:33:46+05:30 IST

కాంగ్రెస్‌ హయంలోనే కృష్ణపట్టె అభివృద్ధి చెందిందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రెం డో రోజు ఆదివారం మండలంలోని పీక్లానాయక్‌ తండా, క్రిష్టపురం, నక్కగూడెం, చింత్రియాల,రేబల్లే, తమ్మారం, అడ్లూరు, శోభనాద్రిగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు.

కాంగ్రెస్‌ హయంలోనే కృష్ణపట్టె అభివృద్ధి
పీక్లానాయక్‌తండాలో మాట్లాడుతున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

చింతలపాలెం, మే 22: కాంగ్రెస్‌ హయంలోనే కృష్ణపట్టె అభివృద్ధి చెందిందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రెం డో రోజు ఆదివారం మండలంలోని పీక్లానాయక్‌ తండా, క్రిష్టపురం, నక్కగూడెం, చింత్రియాల,రేబల్లే, తమ్మారం, అడ్లూరు, శోభనాద్రిగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పులిచింత ప్రాజెక్టులో ముంపునకు గురైన కృష్ణపట్టె గ్రా మలకు రోడ్లు, తాగు, సాగు నీటి సౌకర్యాలు కాంగ్రెస్‌ హయాంలోనే కల్పించామన్నారు. సాగు నీటి కోసం వేల కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్‌ హయాంలో నిర్మిసే, ప్రస్తుత ప్రభుత్వం వాటి నిర్వహణను గాలికి వదిలేసిందన్నారు. దీంతో సాగు నీటి కోసం రైతులు పడిగాపులు కాయల్సిన దుస్థితి నెలకొందన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింలు, గిరిజనులకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణలేకుండా పోయిందన్నారు. రానున్న ఎన్నికలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే అన్నారు. అధికారంలోకి రాగానే ఎస్టీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్‌ పెంచుతామన్నారు. ఈ సందర్భంగా పీక్లానాయక్‌ తండా, నక్కాగూడెం గ్రామలకు చెందిన పలువురు వివిధ పార్టీల నుంచి ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నరాల కొండరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇంద్రరెడ్డి, లకావాత్‌ సైదులు, మంజునాయక్‌, నర్సింహముర్తి శర్మ, మౌలాలి, సైదులు, అంజయ్య, చారి, జాని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T06:33:46+05:30 IST