దేశంలో అతిపెద్ద రెండో ప్రైవేటు పోర్టు కృష్ణపట్నం

ABN , First Publish Date - 2022-08-16T04:23:35+05:30 IST

భారతదేశంలో అతిపెద్ద రెండో ప్రైవేటు పోర్టుగా కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి చెందిందని అదానీ కృష్ణపట్నం పోర్టు సీఈవో జీజే రావు పేర్కొన్నారు.

దేశంలో అతిపెద్ద రెండో ప్రైవేటు పోర్టు కృష్ణపట్నం
ప్రశంసా పత్రాలు అందజేస్తున్న సీఈవో జీజే రావు

సీఈవో జీజే రావు

ముత్తుకూరు, ఆగస్టు 15 : భారతదేశంలో అతిపెద్ద రెండో ప్రైవేటు పోర్టుగా కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి చెందిందని అదానీ కృష్ణపట్నం పోర్టు సీఈవో జీజే రావు పేర్కొన్నారు. పోర్టులో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని  సోమవారం ఘనంగా నిర్వహించారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో అదానీ కృష్ణపట్నం పోర్టు సీఈవో, డైరెక్టర్‌ జీజే రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోర్టు అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2025 నాటికి కాలుష్య రహిత పోర్టుగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకునే విధంగా కిరణ్‌ అదాని సూచించారన్నారు. అందులో భాగంగా పునరుత్పాదక వనరులు వినియోగంపై దృష్టి సాధించామని తెలిపారు. పోర్టులో సౌరశక్తి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని, సముద్రంలోని వ్యర్ధాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి సేకరిస్తామని, పోర్టులో ఎలక్ట్రికల్‌ కార్లను ప్రవేశపెడుతున్నామన్నారు. అదానీ పోర్ట్‌ అడ్మిన్‌ భవనంలో అడ్మిన్‌ హెడ్‌ గణేష్‌ శర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్‌ అఫైర్స్‌ హెడ్‌ జి.వేణుగోపాల్‌, ఫైనాన్స్‌ హెడ్‌ శ్రీకాంత్‌ గుడివాడ, సెక్యూరిటీ హెడ్‌ వెంకటేష్‌, భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-16T04:23:35+05:30 IST