కృష్ణం వందే జగద్గురుం

ABN , First Publish Date - 2020-08-12T08:20:25+05:30 IST

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను మంగళవారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగర శివారులోని ఇస్కాన్‌లో ఉదయం వేడుకల

కృష్ణం వందే జగద్గురుం

భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు


అనంతపురం టౌన్‌, ఆగస్టు 11:  శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను మంగళవారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగర శివారులోని ఇస్కాన్‌లో ఉదయం వేడుకలను ప్రారంభించారు. అనంతరం గురుపూజ,  భా గవత ప్రవచనం, సాయంత్రం ఊంజల సేవ నిర్వహించారు. నగరంలో రామ్‌ నగర్‌ పాండురంగస్వామి దేవాలయంలో భావసార క్షత్రియ సమాజ్‌ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. వేణుగోపాల్‌నగర్‌ సద్గురు సాయినాథ్‌ మందిరంలోని కృష్ణ మందిరంలో మూలవిరాట్టును వెండికవచంతో అలంకరించి, విష్ణు సహస్రనామార్చన చేశారు.


అలాగే మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం, పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం, యాదవభవన్‌, మూడో రోడ్డులోని ఉడిపి శ్రీకృష్ణ మఠం తదితర ఆలయాల్లో కృష్ణ భగవానుడికి విశేష పూజలు గావించారు. ఇదిలా ఉండగా కరోనా దృష్ట్యా చాలా ఆలయాల్లో భక్తులను అనుమతించలేదు. పలు ఆలయాల్లో పరిమిత సంఖ్యలో అనుమతించినా భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టారు.  ఇస్కాన్‌ మందిరంలో మంగళవారం ఉదయం గంట మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించారు. కాగా సూర్యమానాన్ని అనుసరించి ఇస్కాన్‌లో బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్‌ మందిరాల చైర్మన్‌ దామోదర్‌ గౌరంగదాస్‌ వెల్లడించారు.


ఉదయం 10 గంటలకు విశ్వశాంతి యజ్ఞం, రాధాపార్థసారఽథికి అభిషేకాలు, విశేషాలంకరణ, ప్రత్యేక పూజలు, రాత్రి 10 గంటలకు పుష్పాభిషేకం నిర్వహిస్తామన్నారు. వేడుకలను భక్తులు ఫేస్‌బుక్‌, యూటూబ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చునన్నారు.


శింగనమల, ఆగస్టు 11:  మండల వ్యాప్తంగా ప్రజలు మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు  ఘనంగా నిర్వహించారు. శింగనమల, పీ.మట్లగొంది గ్రామాల్లో యాదవులు కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు.

 

పామిడి :  పట్టణంలోని పెద్ద విఠోభస్వామి దేవాలయంలో మంగళవారం కృష్ణాష్టమిని పురస్కరించుకొని యాదవులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కృష్ణుడు ఉత్సవ విగ్రహానికి విశేష పూజలు చేపట్టారు.  


గుంతకల్లుటౌన్‌: పట్టణంలో కృష్ణాష్టమి వేడుకలను మంగళవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు కృష్టుడు, గోపిల వేషధారణలో సందడి చేశారు. 


బ్రహ్మసముద్రం: మండలంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం ఉదయం కృష్ణుడి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేపట్టారు. అనంతరం చిన్నారులకు శ్రీకృష్ణ వేషధారణ వేసి సంబరాలు చేసుకున్నారు. 


తాడిపత్రి టౌన్‌ : పట్టణంలో మంగళవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని గొల్లపాలెంలోని శ్రీ కృష్ణఆలయంలో స్వామివారి మూలవిరాట్‌కు అర్చనలు, అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలో అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను అలంకరించారు.   కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. 


ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

పెనుకొండ/ పెనుకొండ రూరల్‌, లేపాక్షి/ హిందూపురం టౌన్‌, ధర్మవరంఅర్బన్‌/ మడకశిర అర్బన్‌/ అమరాపురం/కదిరి/ అమడగూరు/ ఓబుళదేవర చెరువు, ఆగస్టు11: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మంగళవారం పెనుకొండ పట్టణంలోని మెయిన్‌బజార్‌లో గల గోపాలస్వామి, బోయపాళ్యంలోని కృష్ణస్వామి ఆలయాల్లో అర్చకులు స్వాములకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేశారు. అనంతరం విశేష పూ జలు నిర్వహించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ స్వామిని దర్శించుకున్నారు. 


లేపాక్షిలో  దుర్గావీరభద్రస్వామి ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి  విశేష పూజలు జరిపారు.  హిందూపురం పట్టణంలో  ప్రజలు ఇళ్లల్లోనే పూజలు నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో,  ఇస్కాన్‌మందిరంలో  కృష్ణునికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. కొత్తచెరువులోని వేణుగోపాలస్వామి ఆలయంలోనూ పూజలు జరిగాయి.  మడకశిర పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలను ప్రజలు ఇళ్లల్లోనే జరుపుకున్నారు. అమరాపురం మండలకేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో, హెంజే రు సిద్ధేశ్వరస్వామి, వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి.


కదిరి పట్టణ ప్రజలు ఇళ్లల్లోనే  కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించా రు.  అమడగూరు మండల కేంద్రంతో పాటు  మహమ్మదాబాద్‌, జేకేపల్లి గ్రామాల్లో గల షిర్డ్డీసాయిబాబా, చౌడేశ్వరి  ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పాటిస్తూ పూజ ల్లో పాల్గొన్నారు.   ఓబుళదేవర చెరువు మండల కేంద్రంతో పాటు  గ్రామీణ ప్రాంతాల్లో  మహిళలు ఇళ్లల్లోనే  వేడుకలు జరిపారు. అన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ చిన్నారులకు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు చేసి మురిసిపోయారు.

Updated Date - 2020-08-12T08:20:25+05:30 IST