గూడవల్లి కొవిడ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కృష్ణబాబు

ABN , First Publish Date - 2021-04-26T21:50:38+05:30 IST

గూడవల్లి కొవిడ్ కేంద్రాన్ని స్పెషల్ ఆఫీసర్ కృష్ణబాబు ఆకస్మికంగా తనిఖీచేశారు. కరోనా పేషెంట్స్‌కు అందుతున్న

గూడవల్లి కొవిడ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కృష్ణబాబు

విజయవాడ: గూడవల్లి కొవిడ్ కేంద్రాన్ని స్పెషల్ ఆఫీసర్ కృష్ణబాబు ఆకస్మికంగా తనిఖీచేశారు. కరోనా పేషెంట్స్‌కు అందుతున్న సేవలు, వైద్యంపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 33 వేల బెడ్స్‌ను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. జిల్లాకు 5 వేల బెడ్స్ రెండు మూడు రోజుల్లో అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. ఆక్సిజన్ అవసరం లేనివాళ్లు, మైల్డ్ సింటమ్స్ ఉన్నవాళ్లను కొవిడ్ కేర్‌కు తరలిస్తున్నామన్నారు. 5 శాతం పేషెంట్స్‌కు మాత్రమే ఆస్పత్రి అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 15 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 5 వేల మంది కొవిడ్ కేర్ సెంటర్స్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఫుడ్, శానిటేషన్ విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని పేర్కొన్నారు. మెనూ ప్రకారం లంచ్ లో చికెన్, గుడ్లు ప్రొటీన్ ఫుడ్ అందిస్తున్నామని కృష్ణబాబు తెలిపారు.

Updated Date - 2021-04-26T21:50:38+05:30 IST