కృష్ణా జలాలు కడలి పాలు...

ABN , First Publish Date - 2020-08-25T20:07:23+05:30 IST

ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నదులు వరదలతో పోటెత్తుతున్నాయి. అధిక వర్షపాతం ఓవైపు, భారీ వరదలు మరోవైపు తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక... గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు నదులను కలుపుకుంటే 1,500 టీఎంసీలకు పైగా నీరు ఇప్పటికే సముద్రం పాలయ్యింది.

కృష్ణా జలాలు కడలి పాలు...

శ్రీశైలం : ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నదులు వరదలతో పోటెత్తుతున్నాయి. అధిక వర్షపాతం ఓవైపు, భారీ వరదలు మరోవైపు తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో... గోదావరి,  కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు నదులను కలుపుకుంటే 1,500 టీఎంసీలకు పైగా నీరు ఇప్పటికే సముద్రం పాలయ్యింది.


గోదావరి ప్రవాహంలో ఇది దాదాపుగా సాధారణ విషయమే. అయితే... అప్పుడప్పుడూ మాత్రమే వరదలు వచ్చే కృష్ణా నదిలో కూడా వరుసగా రెండో ఏట అన్ని ప్రాజెక్టులు నిండిపోవడం, సుమారుగా 100 టీఎంసీల నీరు సముద్రంలోకి వదలడం విశేషంగా మారింది. ఇదిలా ఉంటే... రాయలసీమలోని ప్రధాన కాలువలు ఓ వైపు వెలవెలబోతోంటే, దిగువన కృష్ణా నది పొంగిపొర్లడం చర్చనీయాంశమైంది.


రాయలసీమకు వరదల జలాల వినియోగం పట్ల ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరముందనే అభిప్రాయం ఈ నేపధ్యంలో వినిపిస్తోంది. కాగా... కృష్ణా నదిలో భారీ వరదలు అరుదుగా వస్తుంటాయి. 2009 తర్వాత కిందటేడాది సుదీర్ఘకాలం పాటు వరదల ప్రవాహం కనిపించింది. ఆగష్ట్ మధ్య నుంచి అక్టోబర్ మధ్య కాలం వరకూ రెండు నెలల పాటు పలుమార్లు వరద కనిపించింది.


ఈసారి కూడా మళ్లీ దాదాపుగా వరదల ప్రవాహం అదే స్థాయిలో కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీశైలం , నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ ల్లో దాదాపుగా పూర్తి స్థాయి నీటిమట్టం కనిపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న మిగులు జలాలను ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదలాల్సి వస్తోంది.

Updated Date - 2020-08-25T20:07:23+05:30 IST