24 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

ABN , First Publish Date - 2022-08-18T05:45:59+05:30 IST

నాగార్జున సాగర్‌ ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్‌ 24 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు విడుదల చేస్తున్నారు.

24 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల
టెయిల్‌పాండ్‌ నుంచి 17 క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

విజయపురిసౌత్‌, ఆగస్టు 17: నాగార్జున సాగర్‌ ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్‌ 24 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు విడుదల చేస్తున్నారు. జూరాల, రోజాల నుంచి శ్రీశైలానికి 3,01,382 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 3,39,214 క్యూసెక్కులు చేరుతోంది. నాగార్జునసాగర్‌ నుంచి 3,49,259 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం బుధవారం నాటికి 585.10 అడుగులుంది. ఇది 297.72 టీఎంసీలకుసమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1200 క్యూసెక్కులు, ఎడమ కాలువద్వారా 8807, కుడి కాలువ ద్వారా 8529, వరద కాలువ ద్వారా 300, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 32,805, 24 క్రస్ట్‌గేట్లలో 6 గేట్లను 5 అడుగుల మేర, 18 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,98,596, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 3,49,259 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.  శ్రీశైలం నీటిమట్టం 884.00 అడుగులుంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,44,486 క్యూసెక్కులు, రోజా నుంచి 56,896 క్యూసెక్కులు, మొత్తంగా శ్రీశైలం జలాశయానికి 3,01,382 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 


టెయిల్‌పాండ్‌ నుంచి నీటి విడుదల

రెంటచింతల: సత్రశాలలోని నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్ట్‌ 17 క్రస్ట్‌గేట్ల ద్వారా పులిచింతలకు బుధవారం 3,33,939 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఎస్‌ఈ శ్రీరామిరెడ్డి తెలిపారు. ఎగువున ఉన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి రిజర్వాయర్‌లోకి 3,31,623 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. రిజర్వాయర్‌లో 5.335 టీఎంసీల నీరు ఉందన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి జరగడం లేదన్నారు. 


బ్యారేజి దిగువకు 3.12 లక్షల క్యూసెక్కులు

తాడేపల్లి టౌన్‌:  పులిచింతల ప్రాజెక్టు నుండి ప్రకాశం బ్యారేజికి బుధవారం సాయంత్రానికి 3.28 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు జలవనరుల శాఖ జేఈ దినేష్‌ తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 15వేల 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అలాగే బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ, 20 గేట్లను 8అడుగుల మేర 50 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి 3లక్షల 13వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నట్టు తెలిపారు. 


Updated Date - 2022-08-18T05:45:59+05:30 IST