కృష్ణా వర్సిటీలో నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ఉద్వాసన

ABN , First Publish Date - 2021-04-17T05:56:51+05:30 IST

కృష్ణా యూనివర్సిటీలో నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ఉద్వాసనకు గురైయ్యారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కృష్ణా వర్సిటీలో నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ఉద్వాసన

 ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం :  కృష్ణా యూనివర్సిటీలో నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ఉద్వాసనకు గురైయ్యారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నుంచి గురువారం  ఉత్తర్వులు జారీ అయ్యాయి. 5 మార్చి 2021వ తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ఆయా యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్‌ కౌన్పిల్‌  సమా వేశం నిర్వహించి తగు నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2017 డిసెంబరు, 2018 జనవరిల్లో యూనివర్సిటీలో  అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్లు, అసోషియేట్‌ ఫ్రొఫెసర్లు,  ఫ్రొఫెసర్ల నియామకం చేపట్టారు. అప్పట్లో నలుగురు ఫ్రొఫెసర్లను కృష్ణా యూనివర్సిటీలో నియమిం చారు.  ప్రస్తుతం రిజిస్ర్టారుగా పనిచేస్తున్న హైమావతి,  ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న మారుతి, ఇంగ్లీష్‌ విభాగం హెచ్‌వోడీగా పనిచేస్తున్న దిలీప్‌కుమార్‌, నూజివీడు పీజీ సెంటరు  ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న వెంకట్రామ్‌ తమ పదవులను వదులుకోవాల్సి ఉంది. యూనివర్సిటీలో కీలక పోస్టుల్లో ఉన్న అధ్యాపకులు తమ  ఉద్యోగాలను వదుకోవాల్సి రావడం గమనార్హం. కృష్ణా యూనివర్సిటీలో పోస్టులు పోయిన వారు తిరిగి తమ మాతృసంస్థల్లో చేరే అవకాశాలున్నట్లు ఫ్రొఫెసర్లు చెప్పుకుంటున్నారు.  ఈ ఉత్తర్వుల్లోనే యూనివర్సిటీలో విదార్థులు చేరని కోర్సుల్లో అధ్యాపకులు ఉంటే ఆ వివరాలను, విద్యార్థు లున్నా.. అధ్యాపకులు లేకుంటే ఆ వివరాలను తెలియాజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2021-04-17T05:56:51+05:30 IST