Abn logo
Sep 17 2020 @ 11:10AM

ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం..కలవరపడుతున్న భక్తులు

కృష్ణా: జిల్లాలోని దేవాలయాలలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంతో భక్తులు కలవరపడుతున్నారు. నిన్న దుర్గగుడి రథం సింహాలు మాయం, నిడమానూరు సాయిబాబు విగ్రహం ధ్వంసం మరువకముందే జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. వత్సవాయి మండలం మొక్కపేటలో పురాతనమైన కావీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో నంది చెవులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నంది విగ్రహం చెవులు ధ్వంసం విషయాన్ని ఆలయ అర్చకులు, సిబ్బంది పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  కాగా ఉద్దేశ్య పూర్వకంగానే గుడిలోకొచ్చి నంది విగ్రహం చెవులు ధ్వంసం చేసి ఉండవచ్చునని భక్తులు భావిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement