Krishna: ఓవర్‎టేక్ చేయబోయి లారీని ఢీకొట్టిన కారు..

ABN , First Publish Date - 2021-09-30T13:10:21+05:30 IST

గ్గయ్యపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్‎టేక్ చేయబోయిన కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించే ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి

Krishna: ఓవర్‎టేక్ చేయబోయి లారీని ఢీకొట్టిన కారు..

కృష్ణా: జగ్గయ్యపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్‎టేక్ చేయబోయిన కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించే ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన గౌరవరం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-09-30T13:10:21+05:30 IST