సాగర్‌ నీటి సమాచారం

ABN , First Publish Date - 2022-08-05T04:56:16+05:30 IST

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం గురువారం నాటికి 562.10 అడుగులు ఉంది. ఇది 237.30 టీఎంసీలకు సమానం.

సాగర్‌ నీటి సమాచారం
ప్రకాశం బ్యారేజి దిగువకు విడుదల అవుతున్న వరదనీరు

విజయపురిసౌత్‌, ఆగస్టు 4: నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం గురువారం నాటికి 562.10 అడుగులు ఉంది. ఇది 237.30 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 3,667, కుడి కాలువ ద్వారా 1,720, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 7787 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 91,683 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.10 అడుగులుంది. ఇది 210.51 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి శ్రీశైలానికి 81,892 క్యూసెక్కులు, రోజా నుంచి 1,16,062, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మొత్తంగా శ్రీశైలం జలాశయానికి 1,98,204 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 


బ్యారేజి దిగువకు 12,600 క్యూసెక్కులు 

 తాడేపల్లి టౌన్‌: కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎగువన ఉన్న వాగుల నుంచి ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌కు వరదనీటి ఉధృతి స్వల్పంగా కొనసాగుతోంది. కీసర, మునేరు, పాలేరు, మధిర, ముజినేపల్లి తదితర వాగుల నుంచి గురువారం సాయంత్రానికి 25,000 క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 12,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అలాగే బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ, 17 గేట్లను ఒకఅడుగు మేర ఎత్తి 12,600 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నట్టు తెలిపారు. 


Updated Date - 2022-08-05T04:56:16+05:30 IST