రేషన్‌ కార్డు నెంబర్‌తో రైస్‌కార్డు పొందవచ్చు

ABN , First Publish Date - 2020-09-25T10:27:27+05:30 IST

జిల్లాలో 11,96,392 పాత రేషన్‌ కార్డుల స్థానంలో నవశకం 11,39,084 బియ్యం కార్డులు జారీ చేశామని జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రేషన్‌ కార్డు నెంబర్‌తో రైస్‌కార్డు పొందవచ్చు

 జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత

పాయకాపురం, సెప్టెం బరు 24 : జిల్లాలో 11,96,392 పాత రేషన్‌ కార్డుల స్థానంలో నవశకం 11,39,084 బియ్యం కార్డులు జారీ చేశామని జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా జిల్లాలో 59,308 కార్డుదారులు వేరే ప్రాంతంలో ఉన్నారని, వారు ఎక్కడ రేషన్‌ తీసుకుంటున్నారో గుర్తించి అక్కడ బియ్యం కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.


పాత రేషన్‌ కార్డులు కలిగి ఉండి, వాటి స్థానంలో అర్హత ఉండి బియ్యం కార్డులు తీసుకోనివారు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని సూచించారు. జిల్లాలో రసీదు చేయించుకోవాల్సిన కార్డుదారులు సమీప గ్రామ/వార్డు సచివాలయాల్లో కార్డు పొంది ధ్రువీకరించుకోవాలని తెలిపారు. కార్డుదారులు ఇతర ప్రాంతాల్లో ఉంటే దగ్గరలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో రేషన్‌ కార్డు/రైస్‌ కార్డు నెంబర్‌ చెప్పి కార్డు పొందాలని, రసీదు చేయించుకోవాలని సూచించారు. బియ్యం కార్డుకు అర్హులై ఉండి ఇంకా పొందని ప్రతి కార్డుదారుడు వారి గ్రామ/వార్డు సచివాలయం వద్ద రేషన్‌ కార్డు నెంబర్‌ తెలిపి పొందవచ్చని పేర్కొన్నారు.



ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు

ఈ ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 10.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) మాధవీలత పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు.  ధాన్యం కోనుగోలు, సీఎంఆర్‌ బియ్యం సేకరణ అంశాలపై రాష్ట్ర పౌర సర ఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫ రెన్స్‌లో జేసీ మాధవీలత స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు.


Updated Date - 2020-09-25T10:27:27+05:30 IST