కృష్ణం వందే జగద్గురుమ్‌

ABN , First Publish Date - 2022-08-20T05:06:50+05:30 IST

ఆ బాల గోపాలం.. ఆ గోపాలుడి సేవలో త రించింది. ఆయన వేషధారణలో మురిసిపోయింది. నల్లనయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.

కృష్ణం వందే జగద్గురుమ్‌
దెందుకూరు అంగన్‌వాడీ కేంద్రంలో ఉట్టి కొడుతున్న చిన్నారులు

ఆ బాల గోపాలం.. గోపాలుడి వేషధారణలో..

జిల్లావ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

పలు చోట్ల ఉత్సాహంగా ఉట్లు కొట్టే కార్యక్రమం

నెట్‌వర్క్‌: ఆ బాల గోపాలం.. ఆ గోపాలుడి సేవలో త రించింది. ఆయన వేషధారణలో మురిసిపోయింది. నల్లనయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని  జిల్లావ్యాప్తంగా శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. తల్లిదండ్రులు చిన్నారులను కృష్ణుడు, గోపికలుగా ముస్తాబు చేశారు. ఖమ్మం నగరంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు ఉట్టి కొట్టారు. భక్తి గీతాలకు లయబద్ధంగా నృత్యాలు చేశారు.

దెందుకూరులో..

మధిర మండలం దెందుకూరు 2 అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్‌ గుర్రం స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులు ఉట్టి కొట్టారు.

ఏన్కూరులో..

ఏన్కూరు మండలం తూతక్కలింగన్నపేటలో కృష్ణాష్టమి ఘనంగా నిర్వహిం చారు. సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు నిర్వహించారు. ఉట్టికొట్టే కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. కార్యక్ర మంలో దేవస్థానం చైర్మన్‌ ఆదినారాయణ, ఎల్లంకి లక్ష్మినర్సయ్య, ఆళ్ల చిన్న సుబ్బారావు, యాదవ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

బోనకల్‌లో..

బోనకల్‌లో ఆభయాంజనేయ స్వామి ఆలయంలో ఎస్‌ఐ కవిత గోపూజలో పా ల్గొన్నారు. కార్యక్రమంలో పుల్లయ్య, నాగయ్య, ఎంపీటీసీ రమేష్‌, ఉప సర్పంచ్‌ రాఘవ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరావు, ఏఎస్‌ఐ నాగరాజు పాల్గొన్నారు.

వేంసూరులో...

వేంసూరు మండంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకొని వేణుగోపాల స్వామి ఆలయంతోపాటు పలు గ్రామాల్లో శుక్రవారం ఉట్టికొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. కందుకూరులో ఆలయ ఈవో నర్సింహారావు, చైర్మన్‌ రాయల సత్యనా రాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T05:06:50+05:30 IST