కొత్త క్లబ్‌లతో లయన్స్‌ కృష్ణా జిల్లా ప్రపంచ రికార్డు

ABN , First Publish Date - 2021-06-20T09:08:14+05:30 IST

కృష్ణా జిల్లా లయనిజంలో ఈ ఏడాది 61 కొత్త క్లబ్‌లు ఏర్పాటు చేసి లయన్స్‌ క్లబ్‌ ప్రపంచ రికార్డును సాధించిందని జిల్లా లయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌ పుట్టగుంట సతీష్‌ కుమార్‌ తెలిపారు

కొత్త క్లబ్‌లతో లయన్స్‌ కృష్ణా జిల్లా ప్రపంచ రికార్డు

హనుమాన్‌జంక్షన్‌, జూన్‌ 19ః కృష్ణా జిల్లా లయనిజంలో ఈ ఏడాది 61 కొత్త క్లబ్‌లు ఏర్పాటు చేసి లయన్స్‌ క్లబ్‌ ప్రపంచ రికార్డును సాధించిందని జిల్లా లయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌ పుట్టగుంట సతీష్‌ కుమార్‌ తెలిపారు. శనివారం హనుమాన్‌ జంక్షన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ లయనిజం చరిత్రలో ఒకే సంవత్సరంలో ఇన్ని కొత్త క్లబ్‌లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని  తెలిపారు. 142 క్లబ్‌లతో ప్రారంభమైన జిల్లా క్లబ్‌ ప్రస్తుతం 200 క్లబ్‌లకు చేరుకోవడం ఎంతో అనందాన్ని ఇచ్చిందన్నారు. జిల్లావ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రపంచస్థాయిలో జిల్లాకు మూడో స్థానం, భారత్‌లో తొలి స్థానం సాఽధించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలోని క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన క్వాలిటీ హెల్త్‌ సర్వీస్‌, క్వాలిటీ అడ్మినిస్ర్టేషన్‌ విభాగాల్లో ఐఎ్‌సఓ 9001-2015 సర్టిఫికెట్‌ రావడం లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ సర్వీ్‌సలో ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-06-20T09:08:14+05:30 IST