కృష్ణా జిల్లా: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటనలో మార్పులు జరిగాయి. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రావలసిన వెంకయ్య... చెన్నై నుంచి రైలు మార్గాన ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్ట్‌కు వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గన్నవరం రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాట్లను ట్రాఫిక్ ఏడిసిపి, అధికారులు పరిశీలిస్తున్నారు.