కృష్ణా జిల్లా: కంచికచర్ల, ప్రణీత కాలనీలో స్కూటీ దహనమైంది. రాత్రి ఇంటి ఎదుట పార్క్ చేసిన స్కూటీని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి దహనం చేశారు. ఈ ఘటనలో స్కూటీ పూర్తిగా కాలిపోయింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూటీపై చీరల వ్యాపారం చేసే తాను ఉపాధి కోల్పోయానని బాధితురాలు కన్నీటి పర్యంతమయింది. తనకు భర్త లేడని, చీరల వ్యాపారం చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నానని, తనకు విరోధులు ఎవరూ లేరని, తానిప్పుడు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేసింది.