కృష్ణా జిల్లా: ఎమ్మెల్యే వంశీ అసమ్మతి వర్గం 'ఛలో తాడేపల్లి'కి పిలుపు..

ABN , First Publish Date - 2022-05-10T21:53:43+05:30 IST

గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అసమ్మతి వర్గం 'ఛలో తాడేపల్లి'కి పిలుపిచ్చింది.

కృష్ణా జిల్లా: ఎమ్మెల్యే వంశీ అసమ్మతి వర్గం 'ఛలో తాడేపల్లి'కి పిలుపు..

కృష్ణా జిల్లా: గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అసమ్మతి వర్గం 'ఛలో తాడేపల్లి'కి పిలుపిచ్చింది. బుధవారం (11న) గడపగడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం తెరపైకి వచ్చింది. 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన వంశీ..అనంతరం సీఎం జగన్ నేతృత్వంలో వైసీపీకి మద్ధతుపలికారు. దీంతో వైసీపీకి దీర్ఘకాలిక సేవలందించిన నేతల్లో అసంతృప్తి మొదలైంది. ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. 


తాజాగా 2024లో పార్టీ టికెట్ ఎమ్మెల్యే వంశీకి కేటాయిస్తే సహకరించమని పార్టీ అగ్రనేతలకు అసమ్మతి వర్గం హెచ్చరికలు చేసింది. నియోజకవర్గంలో వైసీపీకి కొత్త ఇంఛార్జ్ కావాలంటూ వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ‘మన ఇంట్లో శుభకార్యం మనమే చేసుకుందాం.. పక్కింటి వాడికి ఇవ్వొద్దు.. కొత్త ఇంఛార్జ్ కావాలని’.. ఫ్లెక్సీలు వెలిసాయి. బుధవారం సాయంత్రం 3 గంటలకు గన్నవరం నుంచి బైక్ ర్యాలీగా తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి వెళ్ళేందుకు వంశీ వ్యతిరేక వర్గం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...ఎంత మందిని అదుపులోకి తీసుకున్నా ఛలో తాడేపల్లి కార్యక్రమం విజయవంతం చేస్తామని గన్నవరం వైసీపీ నేతలు స్పష్టం చేశారు.

Read more