కృష్ణాజిల్లాలో భారీగా అక్రమ ఇసుక రవాణా

ABN , First Publish Date - 2022-04-04T16:50:57+05:30 IST

కృష్ణానది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.

కృష్ణాజిల్లాలో భారీగా అక్రమ ఇసుక రవాణా

కృష్ణాజిల్లా: అవనిగడ్డ మండలం, పాత ఎడ్లంక కృష్ణానది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సీఆర్‌జడ్ పరిధి నుంచి అనుమతి లేకుండా భారీ టిప్పర్లతో తరలిస్తున్న ఇసుక అక్రమ రవాణాను గ్రామస్థులు  అడ్డుకున్నారు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సైతం ఈ అక్రమ రవాణాకు వినియోగించడం గమనార్హం. ఎడ్లంక గ్రామ ఉనికిని ప్రశ్నార్థకం చేయొద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్రమ తవ్వకాలతో గ్రామంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వకాలపై విచారణ చేసి నిగ్గు తేల్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-04-04T16:50:57+05:30 IST