కృష్ణాజిల్లా: కొత్త జిల్లాల ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ మిచిలీపట్నం, రావిరాల కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్లుగా రంజిత్ బాషా, మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.