వచ్చే నెల మొదటి వారంలో..

ABN , First Publish Date - 2022-06-30T05:39:11+05:30 IST

వచ్చే నెల మొదటి వారంలో..

వచ్చే నెల మొదటి వారంలో..
చంద్రబాబుతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జులు

అంగలూరు ప్రాంగణంలోనే మహానాడు

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన జిల్లా నాయకులు 

గుడివాడ, జూన్‌ 29 : ‘కృష్ణాజిల్లా మహానాడు’ను జూలై మొదటి వారంలో నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. తన నివాసంలో బుధవారం ఆయన మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ ఇన్‌చార్జులతో సమావేశమై మహానాడు నిర్వహణపై పలు సూచనలు చేశారు. మహానాడు నిర్వహణకు అంగలూరులో ఉచితంగా భూములిచ్చిన రైతులను చంద్రబాబు అభినందించారు. వాతావరణ శాఖ వద్ద సమాచారం సేకరించిన నాయకులు నాలుగు తేదీలపై చర్చలు జరిపినట్టు తెలిసింది. తేదీని గురువారం ప్రకటించే అవకాశం ఉంది. తొలుత అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, కొనకళ్ల నారాయణతో టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు చర్చించారు. అనంతరం అచ్చెన్నాయుడితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుడివాడ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు, మచిలీపట్నం ఇన్‌చార్జి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, గన్నవరం ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, పామర్రు ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా, అవనిగడ్డ ఇన్‌చార్జి మండలి వెంకట్రామ్‌, పెనమలూరు ఇన్‌చార్జి బోడె ప్రసాద్‌, పెడన ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:39:11+05:30 IST