AP News.. కృష్ణా జిల్లా: ఇరు వర్గాల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2022-08-17T21:56:43+05:30 IST

గన్నవరం మండలం, కేసరపల్లి శివారు ప్రాంతాల్లో సుందరయ్య గంగిరెడ్ల కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

AP News.. కృష్ణా జిల్లా: ఇరు వర్గాల మధ్య ఘర్షణ

కృష్ణా జిల్లా (Krishna dist.): గన్నవరం మండలం, కేసరపల్లి శివారు ప్రాంతాల్లో సుందరయ్య గంగిరెడ్ల కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. డ్రైనేజి విషయంపై తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. బయట వ్యక్తులను తీసుకువచ్చి తమపై దాడి చేశారని మరో వర్గానికి చెందిన మహిళలు ఆరోపించారు. ఈ ఘటనపై ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-17T21:56:43+05:30 IST