Abn logo
Jul 8 2020 @ 10:51AM

క్రిష్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి సినిమా?

ఒకవైపు తన దర్శకత్వంలో సినిమా కోసం కథ సిద్ధం చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా డైరెక్టర్ క్రిష్ బిజీ కాబోతున్నాడట. లాక్‌డౌన్ సమయంలో పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నాడట. ఈ క్రమంలో సురేందర్ రెడ్డి రూపొందించబోయే తర్వాతి సినిమాను నిర్మించేందుకు క్రిష్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. 


భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతోందట. అలాగే ఇటీవల `కృష్ణ అండ్ హిజ్ లీలా` సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు రవికాంత్ కూడా క్రిష్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నాడట. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. 


Advertisement
Advertisement
Advertisement