Abn logo
Sep 21 2021 @ 00:31AM

క్రమబద్ధీకరణను వినియోగించుకోవాలి

మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ వెంకటసుబ్బయ్య


గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 20 :  అసైన్‌మెంట్‌ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని పన్ను కడుతున్న వారు క్రమబద్ధీకరించుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇంటి పన్ను చెల్లిస్తూ 75 గజాలలోపు ఉన్న వారికి ప్రభుత్వం క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిందన్నారు.  లబ్ధిదా రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో  తహ సీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, వైస్‌చైర్మన్లు ఆర్‌.డి.రామకృష్ణ, కాతా దీపిక, నగర పం చాయతీ  కమిషనర్‌ వై.రామకృష్ణ పాల్గొన్నారు.