Abn logo
Sep 17 2020 @ 09:01AM

రేపట్నుంచి కోయంబేడు మార్కెట్‌ మళ్లీ ప్రారంభం

చెన్నై : స్థానిక కోయంబేడు మార్కెట్‌ను దశలవారీగా పునః ప్రారంభించేందుకు సీఎండీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా ఆ మార్కెట్‌లో 492 కిరాణా దుకాణాలను ఈనెల 18 నుంచి తెరిచేందుకు అధికారులు అనుమతిచ్చారు. దీంతో బుధవారం ఆ కిరాణా దుకాణాలకు వ్యాపారులు లారీల్లో సరకులను దిగుమతి చేసుకున్నారు. ఏప్రిల్‌ 27న కొంత మంది వ్యాపారులకు పాజిటివ్‌ లక్షణాలు బయటపడటంతో కోయంబేడు మార్కెట్‌‌ను మూసివేశారు.

పూందమల్లి సమీపంలోని తిరుమళిసై మైదానంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేసి వ్యాపారులను అక్కడికి తరలించారు. పూలు, పండ్ల దుకాణాలను మాధవరం బస్‌స్టేషన్‌ ప్రాంతానికి మార్చారు. లాక్‌ డౌన్‌లో సడలింపుల నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనల మధ్య కోయంబేడు మార్కెట్‌లో కిరాణా సరకుల దుకాణాలు ప్రారంభించ నున్నారు. ఇక కూర గాయల దుకాణాలను ఈనెల 28 నుంచి ప్రారంభిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, ప్రస్తుతం కూరగాయల దుకాణాలను శుభ్రం చేసే పనులు జోరుగా సాగుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement