‘నాడు-నేడు’కు ఇసుక కొరత రాకూడదు

ABN , First Publish Date - 2020-06-07T05:57:34+05:30 IST

నాడు-నేడు పథకంలో చేపట్టిన నిర్మాణాలకు ఇసుక కొరత ఏర్పడ కుండా సరఫరా చేయాలని కొవ్వూరు ఆర్డీవో

‘నాడు-నేడు’కు ఇసుక కొరత రాకూడదు

కొవ్వూరు, జూన్‌ 6 : నాడు-నేడు పథకంలో చేపట్టిన నిర్మాణాలకు ఇసుక కొరత ఏర్పడ కుండా సరఫరా చేయాలని కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. కొవ్వూరు ఆర్టీవో కార్యాలయంలో శుక్ర వారం రాత్రి ఇసుక ర్యాంపుల్లో లారీ యాజమానులు, ఏపీఎన్‌డీసీ అధికారులతో సమీక్షించారు.79 వేల టన్నుల ఇసుక అవ సరమైందని ఇప్పటి వరకు 40,597 టన్నుల ఇసుక ఆర్డర్లు వచ్చా యన్నారు.సుమారు 26 వేల టన్నుల ఇసుక సరఫరా చేశామన్నారు. 14,296 టన్నుల ఇసుక రాబోయే మూడు రోజుల్లో సరఫరా చేయాలని ఆదేశించారు. ర్యాంపులు ఉద యం 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6గంటలకు మూసివేసే విధ ంగా చర్యలు తీసుకో వాలన్నారు. పడవ యాజమానులకు అందించాల్సిన బిల్లులు త్వరితగతిన అందజేయాలన్నారు.కార్యక్రమంలో ఏపీఎండీసీ జిల్లా అధికారి ఎస్‌కేవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-07T05:57:34+05:30 IST