రైళ్లకు లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2022-08-17T06:50:58+05:30 IST

కొవిడ్‌ కారణంగా కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో నిలిపివే సిన రైళ్లు పునఃప్రారంభం కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రైళ్లకు లాక్‌డౌన్‌

కొవ్వూరు స్టేషన్‌లో ఇంకా కొవిడ్‌ నిబంఽధనలు అమలు

పూర్తిస్థాయిలో పునఃప్రారంభం కాని రైళ్లు

80 గ్రామాల ప్రజల ఇక్కట్లు.. పట్టించుకోని అధికారులు


కొవ్వూరు, ఆగస్టు 16 : కొవిడ్‌ కారణంగా కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో నిలిపివే సిన రైళ్లు పునఃప్రారంభం కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ డివిజన్‌..ఆధ్యాత్మిక కేంద్రమైన కొ వ్వూరు రైల్వేస్టేషన్‌లో కొవిడ్‌కు ముందు 35 రైళ్లు ఆగేవి. ప్రస్తుతం మూడు రెళ్లు మాత్రమే నిలుపుదల చేస్తున్నారు.దీంతో కొవ్వూరు రైల్వే స్టేషన్‌ పరిధిలోని కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లోని సుమారు 80 గ్రామాలకు పైగా ప్రజలు చెంతనే రైల్వేస్టేషన్‌ ఉన్నా రాజ మహేంద్రవరం వెళ్లి రైలు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. రోడ్డు కం రైలు బ్రిడ్జిపై ఒక్కొక్కసారి ట్రాఫిక్‌ అంతరాయాల కారణంగా ప్రయాణికులు రైళ్లను మిస్‌ అవడంతో ప్రయాణాన్ని రద్దుచేసుకుని తిరిగి ఇంటిముఖం పడుతున్నారు.దేశవ్యాప్తంగా రైళ్లను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో దేశంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో గతంలో నిలు పుదల చేసినట్టు 35 రైళ్లను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 80 గ్రామాల ప్రజల సౌకర్యార్థం కొవ్వూరు స్టేషన్‌లో రెగ్యులర్‌ రైళ్లతో పాటు, బెం గళూరు, మహారాష్ట్ర, చెన్నై, కర్నాటక, కేరళ వెళ్లే రైళ్లను నిలుపుదల చేయాలన్నారు.ఈ మేరకు పీఏసీ చైర్మన్‌ పీకే.కృష్ణదాస్‌కు రాష్ట్ర మహిళ మోర్చ అధ్యక్షురాలు నిర్మలా కిషోర్‌ మంగళవారం ఢిల్లీలో వినతిపత్రం అందజేసినట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరిమి రా ధాకృష్ణ తెలిపారు.అదే విధంగా ఈడీపీఎం నీరజ్‌ శర్మ, డీపీఎం విపుల్‌ సింఘాల్‌లకు వినతిపత్రాలు అందజేశారన్నారు. 


Updated Date - 2022-08-17T06:50:58+05:30 IST