నిర్లక్ష్యం వద్దు..నియంత్రణ అవశ్యం

ABN , First Publish Date - 2021-04-11T06:48:02+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

నిర్లక్ష్యం వద్దు..నియంత్రణ అవశ్యం

  ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు పిలుపు

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 10 : కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.  ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మాట్లాడుతూ, జిల్లాలోని కొందరు ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాస్కులు ధరించడం లేదన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించి మాట్లాడాలన్నారు. ఏఎస్పీ మల్లికా గార్గ్‌ మాట్లాడుతూ, స్వీయ సంరక్షణ మాత్రమే కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేస్తుందన్నారు. ఆర్డీవో ఖాజావలి మాట్లాడుతూ,   ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ, శానిటైజర్‌ వాడుతూ, భౌతిక దూరం పాటించాలన్నారు. ముందు వరుసలో ఉండి విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు.  ఏఆర్‌ ఏఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ డీఎస్పీ ధర్మేం ద్ర, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్‌ డీఎస్పీ మసుంబాషా, ఏఆర్‌ డిఎస్పీ విజయకుమార్‌, ఎస్బీ సీఐ నాగేంద్రకుమార్‌, చిలకలపూడి సీఐ అంకబాబు, ఇనకుదురు సీఐ శ్రీనివాసరావు, రూరల్‌ సీఐ కొండయ్య, ఆర్‌పేట సీఐ బీమరాజు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Updated Date - 2021-04-11T06:48:02+05:30 IST