రోడ్డు పక్కనే కొవిడ్‌ వ్యర్థాలు

ABN , First Publish Date - 2021-05-17T04:44:15+05:30 IST

ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నుం చి కోవిడ్‌ కిట్లను, వ్యర్థాలను మున్సిపల్‌ శానిటరీ సిబ్బంది వాహనాల ద్వారా తీసుకొచ్చి కొర్రపాడు రోడ్డు పక్క నే వేస్తున్నారని రాజీవ్‌కాలనీ వాసులు వాపోతున్నా రు.

రోడ్డు పక్కనే కొవిడ్‌ వ్యర్థాలు
రోడ్డు పక్కనే వేసిన కొవిడ్‌ వ్యర్థాలు

 కరోనా భయంతో భయపడుతున్న రాజీవ్‌ కాలనీ ప్రజలు ఎవరికి చెప్పినా పట్టించుకునేవారులేరంటున్న వైనం

ప్రొద్దుటూరు రూరల్‌, మే 16: ప్రొద్దుటూరులోని  జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నుం చి కోవిడ్‌ కిట్లను, వ్యర్థాలను  మున్సిపల్‌ శానిటరీ సిబ్బంది వాహనాల ద్వారా తీసుకొచ్చి కొర్రపాడు రోడ్డు పక్క నే వేస్తున్నారని రాజీవ్‌కాలనీ వాసులు వాపోతున్నా రు. రోడ్డు సమీపంలోనే మున్సిపల్‌ డంపింగ్‌ యార్డు ఉన్నప్పటికి వాటిని అక్కడ  వేయకుండా నడిరోడ్డు పక్కన  వదిలి వెళుతుండడం ఏ మిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కరోనా సెకెండ్‌వేవ్‌ విజృంభిస్తున్న సమయంలో  ఇలా రోడ్డు పక్కనే కొవి డ్‌ వ్యర్థాలను వదలి వెళ్లడంతో రాజీవ్‌కాలనీ ప్రజలు ఎక్కడ కరోనా సోకుతుందేమోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. వారం కిందట ఇలాగే నడిరోడ్డు పక్కనే వాహనం ద్వారా వ్యర్థాలు వదలుతుండగా రాజీవ్‌కాలనీ ప్రజలతోపాటు కొర్రపాడు రోడ్డు లో నివాసం ఉంటున్న ఇటుకల బట్టీల యజమానులు, గోపవరం గ్రామ సర్పంచ్‌, కార్యదర్శి గురుమోహన్‌లు మున్సిపల్‌ చెత్తవాహనాలను అడ్డుకున్నారు. ఆ సమయంలో ఇక నుంచి వ్యర్థా లను  డంప్‌యార్డులో లోపల వేస్తామని చెప్పి హా మీ ఇచ్చిన మున్సిపల్‌ సిబ్బంది మళ్లీ షరా మామూలుగానే రోడ్డుపై వదిలి వెళుతున్నారన్నారు. ఈ విషయమై పలుమార్లు  మున్సిపల్‌ కమిషనర్‌తోపా టు సంబంధిత అధికారులకు  ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని రాజీవ్‌ కాలనీ ప్రజలు, గోపవరం గ్రామ పంచాయతీ సచివాలయ అధికారులు వాపోతున్నారు. ఎంత చెప్పినా మున్సిపల్‌ శానిటరీ సిబ్బంది తీరు మారడంలేదన్నారు. గతంలో ఇలాగే రోడ్డుపై చెత్త, వ్యర్థపదార్థాలు వేయడం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయని గోపవరం గ్రామ పంచాయతీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు దస్తగిరిరెడ్డి పేర్కొన్నారు. ఇలా వ్యర్థాలు రోడ్డుపై వేయడంతో గాలికి ఎగిరి ఇళ్లవద్ద పడుతున్నాయని, ఈ విధంగా పడటంతో ఎక్కడ తమకు కరోనా సోకుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అక్కడ వ్యర్థాలు వేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఇందిరానగర్‌ ప్రజలు, రాజీవ్‌ కాలనీ ప్రజలు పేర్కొన్నారు. నిత్యం ఆ రహదారిలో  అధికారులు తిరుగుతున్నా కొవిడ్‌ వ్యర్థాలపై పట్టించుకోవడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి కొవిడ్‌ సెంటర్‌ వ్యర్థపదార్థాలను, కిట్లను వేయకుండా జనసంచారానికి దూరంగా వేయడంకా ని కాల్చివేయడం కాని చేయాలని పజలు కోరుతున్నారు. 

మున్సిపల్‌ సిబ్బంది వేయలేదు

ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ రాఽధను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌ ద్వారా వివరణ కోరగా డంపింగ్‌ యార్డు సమస్య ఉండడం వల్ల మున్సిపాలిటీ వ్యర్థా లు రోడ్డుపైకి వస్తున్న విషయం వాస్తవమేనన్నారు. కొవిడ్‌ కేంద్రాలకు సంబంధించి వ్యర్థాలు మున్సిపల్‌ సిబ్బంది వేయడం లేదని కొవిడ్‌ కేంద్రాలలో నోడల్‌ అధికారులు  ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సిబ్బంది వేస్తున్నారమో తమకు తెలియదన్నారు. ఈ విషయం తహసీల్దార్‌, ఆత్మ పీడీ  వారి పరిధిలో ఉందన్నారు. గోపవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి గురుమోహన్‌ను వివరణ కోరగా ఎన్నోమార్లు రాత పూర్వకంగా మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు.  గోపవరం గ్రామ పంచాయతీలో ఈ వ్యర్థాలవలనే ఈనెలలో కరోనా కేసులు అధికమయ్యాయని సచివాలయ అధికారులు, సిబ్బంది తనకు నివేదిక పంపారన్నారు. 

Updated Date - 2021-05-17T04:44:15+05:30 IST