Abn logo
Apr 21 2021 @ 01:04AM

కొవిడ్‌ బాధితులను ఆదుకోవాలి

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా ఉత్తర ప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌

- ప్రచారంతో ప్రజల్లో అవగాహన కల్పించాలి :  సీపీఎం విజ్ఞప్తి

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 20 : జిల్లాలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నా... అధికా ర యంత్రాంగం నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరమని, వెంటనే కొవిడ్‌ బాధితులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా ఉత్తరప్రాం త కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గణేనాయక్‌భవనలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అధి కారులు ప్రకటిస్తున్న పాజిటివ్‌ కేసుల సంఖ్యకు, వాస్తవ పరిస్థితికి చాలా వ్యత్యాసముందన్నారు. గతంలో పాజిటివ్‌ వచ్చిన వారి నుంచి వ్యాధి విస్తరించకుండా వేరుచేసి, వైద్యం అందించారన్నారు. అయితే ప్రస్తుతం అలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. టీకా వేయించుకోవడానికి, కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉంటున్నారన్నారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థన్నా ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు లేవన్నారు. క్వారంటైన కేంద్రాలను పెంచాలన్నారు. కరోనా బాధితుల నుంచి కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు నిలువునా దోచుకుంటున్నాయన్నారు. రెమిడెసివర్‌ వ్యాక్సినను రూ.10వేల నుంచి రూ.15వేలకు విక్రయిస్తున్నారన్నారు. ఇప్పటికే అనేకమంది మృతిచెందారని, మరికొందరు వ్యాధితీవ్రతతో ప్రాణాపాయంలో ఉన్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాం గం ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శివర్గ సభ్యుడు బాలరంగయ్య పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement