రొద్దంలో కొవిడ్‌ వ్యాక్సిన ఖాళీ

ABN , First Publish Date - 2021-04-13T05:55:24+05:30 IST

రొద్దం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్‌వ్యాక్సిన టీకా ఖాళీ అయింది.

రొద్దంలో కొవిడ్‌ వ్యాక్సిన ఖాళీ

రొద్దం, ఏప్రిల్‌ 12: రొద్దం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్‌వ్యాక్సిన టీకా ఖాళీ అయింది. అనేక రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి నుండి 45నుండి 60సంవత్సరాలు పైబడిన వృద్దులకు అనారోగ్య బాధితులకు వ్యాక్సిన టీకా అందించారు. అయితే మండల వ్యా ప్తంగా 1591 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. శనివారం నుండి కోవిడ్‌ వ్యాక్సిన అందుబాటులో లేకపోవడంతో టీకా వేయించుకునేందుకు ఆసక్తిఉన్న వ్యక్తులు ఆసుపత్రికి వెళ్లి వెనుతిరిగి వచ్చారు. 14నుంచి తిరిగి వ్యాక్సిన అందుబాటులోకి వస్తుందని వైద్యాధికారి రోహిల్‌, ఎంపీహెచఈఓ శ్రీనివాసులు తెలిపారు. 

Updated Date - 2021-04-13T05:55:24+05:30 IST