నేటి నుంచి పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2022-01-03T06:21:58+05:30 IST

ఒమైక్రాన్‌, కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యం లో 15-18ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన వ్యాక్సిన్‌ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది.

నేటి నుంచి పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌

2007లోపు జన్మించిన వారికి మాత్రమే టీకా

15-18 ఏళ్ల వయసు వారు ఉమ్మడి జిల్లాలో 2.86లక్షల మంది

ఈ నెల10 నుంచి ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌ డోస్‌


 నల్లగొండ అర్బన్‌, సూర్యాపేటటౌన్‌, భువనగిరిటౌన్‌: ఒమైక్రాన్‌, కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యం లో 15-18ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన వ్యాక్సిన్‌ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. అదే విధంగా కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, 60 ఏళ్లు పైబడినవారికి ఈ నెల 10వ తేదీ నుంచి బూస్టర్‌ డోస్‌ ఇవ్వనున్నారు. అందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. 


కొవిడ్‌ వ్యాక్సిన్‌ను 2007 జనవరి నెలకు ముందు పుట్టిన 15-18 ఏళ్ల వయసు వారికి మాత్రమే టీకా ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వయసు వారు సుమారు 2.86లక్షల మంది ఉన్నట్టు వైద్యశాఖ అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా వ్యాక్సినేషన్‌ షెడ్యూల్‌ను అధికారులు రూపొందించా రు. పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా వేయనున్నారు. మొదటి డోస్‌ తీసుకున్న 28 రోజులకు రెండో డోస్‌ ఇస్తారు. పెద్దలకు మాదిరిగా రెం డో డోస్‌కు 80రోజులు సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్‌ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆధార్‌కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపుకార్డులు తీసుకొచ్చి నేరుగా టీకా కేంద్రాల వద్ద పేరు, ఇతర వివరాలు నమో దు చేసుకొని టీకా వేస్తారు. పిల్లల వెంట విధిగా వారి తల్లిదండ్రులు రావాల్సి ఉంటుంది. టీకా వేయించుకున్న అరగంట వరకు కేంద్రం వద్దే వేచి ఉండాలి. ఏవైనా ఆరోగ్య సమస్య లు తలెత్తితే అక్కడున్న వైద్య సిబ్బందికి తక్షణ చికిత్స అందజేస్తారు. నల్లగొండ జిల్లాలో 44 కేంద్రాల్లో, యాదాద్రి జిల్లాలో 44 కేంద్రాల్లో, సూర్యాపేట జిల్లాలో 30 కేంద్రాల్లో పిల్లలకు టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో టీకా వేస్తారు. అదేవిధంగా ఇంటర్మీడియట్‌, పైస్థాయి కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అర్హులైన పిల్లలకు తొలి డోస్‌ వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


2.86లక్షల మందికి టీకా

ఉమ్మడి జిల్లాలో 15-18 ఏళ్ల వయసు వారు సుమారు 2.86లక్షల మంది ఉన్నట్టు వైద్యశాఖ అధికారుల అంచనా. ఈ వయసు వారు నల్లగొండ జిల్లాలో 1.30లక్షల మంది, సూర్యాపేట జిల్లాలో 1.10లక్షల మంది, యాదాద్రి జిల్లాలో 46,777మంది ఉండగా, వీరంతా టీకాకు అర్హులుగా గుర్తించారు. సూర్యాపేట జిల్లా జనాభా 11,72,752. అందులో 18 ఏళ్లు పైబడిన వారికి తొలి డోస్‌ 7,97,475 మందికి టీకా వే యాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు 7,32,019 మందికి తొలి డోస్‌ టీకా వేశారు. ఇంకా 65,456 మందికి టీకా ఇవ్వాల్సి ఉంది. రెండో ఇప్పటి వరకు 4,95,347 మందికి వేశారు. ఇం కా 3,02,128 మందికి రెండో డోస్‌ ఇవ్వాల్సి ఉంది. మొదటి డోస్‌ 90శాతం పూర్తికాగా, రెండో డోస్‌ 50 శాతమే పూర్తయింది. కాగా, రెండో డోస్‌ ఇవ్వడం వైద్యశాఖ సిబ్బందికి సవాల్‌గా మారింది. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్‌ వేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. అయితే కొం దరు వ్యాక్సిన్‌ వేయించుకునేది లేదని వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో సిబ్బంది సైతం ఏం చేయలేకపోతున్నారు. యాదాద్రి జిల్లా జనాభా 7.94లక్షలు. అందులో 18ఏళ్లు పైబడిన వారు 5,23,068 మంది వ్యాక్సిన్‌కు అర్హులుగా గుర్తించా రు. ఇప్పటి వరకు తొలి డోసు 5,29,843 మందికి, రెండో డోసు 4,18,975 మందికి పూర్తయింది. రెండో డోసుకు చాలామంది దూరంగా ఉండగా, వారిని గుర్తించి వందశాతం లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు అధికారులు నిర్ణయించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో సూర్యాపేట జిల్లాలో 1035 మంది ఆశా వర్కర్లు, 308 మంది ఏఎన్‌ఎంలు, 1200 మంది అంగన్‌వాడీ టీచర్లు, 100 మంది అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, 300 మం ది మునిసిపల్‌, రెవెన్యూ, పంచాయితీరాజ్‌ సిబ్బంది పాల్గొననున్నారు. కాగా, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై యాదాద్రి డీఎంహెచ్‌వో జి.సాంబశివరావు, జిల్లా టీకాల అధికారి డాక్టర్‌ పరిపూర్ణాచారి ఆదివారం గూగుల్‌ మీట్‌ నిర్వహిం చి వైద్యశాఖ యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆదివా రం సమావేశం నిర్వహించారు. నిర్దేశించిన సమయంలోగా పిల్లలకు 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.


ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌ డోస్‌

పిల్లలకు ఈ నెల 8వ తేదీ లోపు తొలి డోసు వ్యాక్సిన్‌ లక్ష్యాన్ని పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. అనంతరం 10వ తేదీ నుంచి కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ వైద్య ఆరోగ్యశాఖ, మునిసిపాలిటీ, ఐసీడీఎస్‌, పంచాయతీరాజ్‌, పోలీస్‌ సిబ్బందికి బూస్టర్‌ డోస్‌ ఇవ్వనున్నారు. అదేవిధంగా 60 ఏళ్లు పైబడిన వారికి సైతం బూస్టర్‌ డోస్‌ వేయనున్నారు. అయితే మొదటి డోస్‌ తీసుకొని 10నెలలు పూర్తయిన వారికి మాత్రమే బూస్టర్‌ డోస్‌ ఇవ్వనున్నారు. సూర్యాపేట జిల్లాలో 6వేల మంది ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ ఉన్నారు. యాదాద్రి జిల్లాలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ 10.90వేల మంది, 60 ఏళ్లు పైబడిన వారు 1.45లక్షల మంది ఉన్నారు. 


పిల్లలకు కరోనా టీకాలు వేయించాలి : పెండెం వెంకటరమణ, సూర్యాపేట జిల్లా వ్యాక్సినేషన్‌ అధికారి

15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 3వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు వైద్యఆరోగ్యశాఖ సిద్ధంగా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా టీకా వేయించుకొని వైద్య సిబ్బందికి సహకరించాలి. వ్యాక్సిన్‌ వేసుకుంటే ఒమైక్రాన్‌ వంటి వేరియంట్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.


తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి :  డాక్టర్‌ జి.సాంబశివరావు, యాదాద్రి డీఎంహెచ్‌వో

పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. వ్యాక్సినేషన్‌ ప్రక్రి య కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తిచేశాం. రెగ్యులర్‌ కేంద్రాలతో పాటు జిల్లాలోని ప్రతీ సబ్‌ సెంటర్‌ పరిధిలో, ఇంటర్మీడియట్‌ పైస్థాయి కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నాం.


Updated Date - 2022-01-03T06:21:58+05:30 IST