అమరావతి: ఏపీకి మరో 2.04 లక్షల కొవిడ్ టీకా డోసులు ఏపీకి చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కొవిషీల్డ్ టీకా డోసులను రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో వ్యాక్సిన్ జిల్లాలకు తరలివెళ్లనుంది. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం లభించింది.