మరణించిన వ్యక్తికి కొవిడ్‌ టీకా ధ్రువీకరణ పత్రం

ABN , First Publish Date - 2021-10-18T06:11:31+05:30 IST

మరణించిన వ్యక్తికి కొవిడ్‌ టీకా వేసినట్లు ధ్రువీకరణ పత్రం రావడంతో అతని కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.

మరణించిన వ్యక్తికి కొవిడ్‌ టీకా ధ్రువీకరణ పత్రం
అధికారులు జారీచేసిన కొవిడ్‌ టీకా ధ్రువీకరణ పత్రం

- అవాక్కైన కుటుంబ సభ్యులు

కోనరావుపేట, అక్టోబరు 17: మరణించిన వ్యక్తికి కొవిడ్‌ టీకా వేసినట్లు ధ్రువీకరణ పత్రం రావడంతో అతని కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్‌ గ్రామానికి చెందిన గుండ మల్లేశం(68) అనే వ్యక్తికి కోనరావుపేట అరోగ్య కేంద్రంలో ఏప్రిల్‌ 23న మొదటి డోస్‌  కొవిడ్‌ టీకా వేశారు. మల్లేశం అనారోగ్య కారాణా లవల్ల అగస్టు 7న మృతి చెందాడు. మృతి చెందిన మల్లేశంనకు అక్టోబరు 12న రెండో డోస్‌ టీకా వేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు రికార్డుల్లో నమో దు చేసి, టీకా నమోదు ధ్రువీకరణ పత్రం జారీచేశారు. మల్లేశం రెండో డోస్‌ టీకా తీసుకున్నారని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో కుటుంబ సభ్యులు అవా క్కయ్యారు. పొరపాటున వచ్చిందనుకుని కొవిన్‌ పోర్టల్‌లో చూస్తే రెండో డోస్‌ టీకా వేసుకున్నట్లు సర్టిఫికెట్‌ వచ్చింది. కొవిడ్‌ టీకా వంద శాతం పూర్తి చేయాలని ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేయడంతో సిబ్బంది టీకా వేయకుం డానే వేసినట్టుగా రికార్డులు తయారు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నా రు. మండల వైద్యాధికారి మోహనకృష్ణను ఈ విషయంపై వివరణ కోరగా ప్రస్తుతం కరోనా టీకాలకు సంబంధించిన సైట్‌ ఓపెన్‌ కావడం లేదని అన్నారు.  సైట్‌ ఓపెన్‌ అయిన తర్వాత రికార్డుల్లో ఎలా తప్పుగా నమోదు అయింది అనేది విచారణ జరుపుతామని చెప్పారు.


Updated Date - 2021-10-18T06:11:31+05:30 IST