కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-05-15T05:03:48+05:30 IST

రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గమైన పెందుర్తిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రం లేకపోవడం దారుణమని, వెంటనే నియోజకవర్గం పరిధిలోని అన్ని పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న బండారు అప్పలనాయుడు

పెందుర్తిలో లేకపోవడం దారుణం

టీడీపీ నేత బండారు అప్పలనాయుడు  

పరవాడ, మే 14: రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గమైన పెందుర్తిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రం లేకపోవడం దారుణమని, వెంటనే నియోజకవర్గం పరిధిలోని అన్ని పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. ఇదే విషయమై ఆయన శుక్రవారం స్థానిక విలేఖరులకు వీడియో సందేశం పంపారు. వ్యాక్సినేషన్‌ కోసం పరవాడలో వున్న వారిని గాజువాక, అచ్యుతాపురం, ఎలమంచిలి వెళ్లమని అధికారులు చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోనే ఫార్మాసిటీ ఉందని, రాష్ట్రాలకు, దేశాలకు కావాల్సిన ఔషధాలన్నీ ఇక్కడి నుంచి వెళుతున్నాయన్నారు. అలాంటిది పెందుర్తి నియోజకవర్గంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రం లేకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకుండా వుండడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెందుర్తి నియోజకవర్గంలోని అన్ని పీహెచ్‌సీల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను చేపట్టాలని కోరారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హెల్త్‌ సెక్రటరీ, రాష్ట్ర ఆరోగ్య మంత్రికి, జిల్లా కలెక్టర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి ఉత్తరాలు రాశారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే రాజకీయంగా ఏం చేయాలో ప్రజలతో చర్చించాకే వెల్లడిస్తామని బండారు అప్పలనాయుడు స్పష్టం చేశారు. 


Updated Date - 2021-05-15T05:03:48+05:30 IST